Apple iPhone 15 Price Down After iPhone 16 Launch: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు, యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను మార్కెట్లోకి వచ్చేశాయి. యాపిల్ కంపెనీ ఈసీవో టిమ్ కుక్ వీటిని రిలీజ్ చేసి.. వాటి విశేషాలను వెల్లడించారు. ఇక మొబైల్ లవర్స్ ఎంతోగానో వేచి చూస్తునన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు సరికొత్త ఫీచర్లతో వచ్చాయి. ఈ సిరీస్‌లో టచ్ సెన్సిటివ్ కెమెరాతోపాటు యాక్షన్ బటన్ కూడా ఉంటుంది. ఇక ఐఫోన్ 16 లాంచ్‌తో ఊహించినట్లే గతేడాది మోడల్స్ iPhone 15, iPhone 15 Plus ధరలు ఒకేసారి భారీగా తగ్గిపోయాయి. యాపిల్ స్టోర్‌లో ఒకేసారి దాదాపు రూ.10 వేల వరకు ధర తగ్గడం గమనార్హం. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ స్టోర్స్‌లో మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.
Also Read: Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..
ఐఫోన్ 15 128GB వేరియంట్ గతంలో 79,600 రూపాయలకు విక్రయించారు. ప్రస్తుతం రూ.69,900 (రూ.9,700 తగ్గింది)కి అందుబాటులో ఉంది. 256GB, 512GB మోడల్‌లు కూడా ధర తగ్గింపునకు లభిస్తున్నాయి. గతంలో వాటి ధరలు వరుసగా రూ.89,600, రూ.1,09,600 నుంచి రూ.9,700 తగ్గి రూ.79,900, 99,900 రూపాయలకు విక్రయిస్తున్నారు. iPhone 15 Plus 128GBకి రూ.79,900, 256GBకి రూ.89,900, 512GB రూ.1,09,900కి అందుబాటులో ఉంది. గతంలో రూ.89,600, రూ.99,600, రూ.1,19,600లకు విక్రయించారు.
కేవలం iPhone 15, iPhone 15 Plus ధరలు మాత్రమే కాకుండా.. iPhone 14, iPhone 14 Plus ధరలు కూడా భారీగా తగ్గాయి. ఐఫోన్ 14 128GB వేరియంట్ ఇప్పుడు రూ.59,900 నుంచి మొదలవుతుంది. 128GB ఐఫోన్ 14 ప్లస్ కేవలం రూ.69,900 విక్రయిస్తున్నారు.
భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలు ఇలా..
iPhone 16 128 GB రూ.79,900, 256 GB రూ.89,900, 512 GB రూ.1,09,900 ధరలకు లభిస్తున్నాయి. iPhone 16 ప్లస్ ధరలు రూ.89,900 (128GB), రూ.99,900 (256GB), రూ.1,11,900 (512GB)గా ఉన్నాయి. iPhone 16 Pro 128GB రూ.1,19,900, 256GB రూ.1,29,900, 512GB రూ.1,49,900, 1TBలో రూ.1,69,900. iPhone 16 Pro Max 256GB రూ.1,44,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB రూ.1,64,900, 1TB ధర రూ.1,84,900గా ఉంది. సెప్టెంబర్ 20 నుంచి మన దేశంలో లభించే అవకాశం ఉంది.
Also Read: Low Pressure Threat: ఏపీకు పొంచి ఉన్న మరో అల్పపీడనం, తుపానుగా మారుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.