పోలీసుల ఎదుట లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

పోలీసుల ఎదుట లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

Last Updated : Aug 13, 2019, 04:51 PM IST
పోలీసుల ఎదుట లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

విజయవాడ: పోలీస్ స్టేషన్‌పై దాడి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించి శాంతి భద్రతల విఘాతం కలిగించారని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావుపై అదే నియోజకవర్గ పరిధిలోని మలికిపురం పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు స్వయంగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు... ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే అనుచరులు 15 మందిని సైతం అదుపులోకి తీసుకున్నారు. 

ఈ కేసు విషయమై ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్ ఖాన్ మాట్లాడుతూ.. చట్టం ముందు అందరూ సమానమేనని.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే ఎంతటివారిపైనైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజాప్రతినిధి అయి ఉండి బాధ్యతారాహిత్యంగా పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడినందుకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌తో పాటు, ఆయన అనుచరులపైనా కేసు నమోదు చేసినట్టు ఏఎస్ ఖాన్ మీడియాకు వెల్లడించారు. మలికిపురంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏఎస్ ఖాన్ స్వయంగా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Trending News