Kalinga Movie: కళింగ మూవీ రిజల్ట్‌పై చిత్రబృందం రియాక్షన్ ఇదే..!

Kalinga Movie Success Meet: కళింగ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో చిత్రబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ప్రేక్షకులు తమ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారని.. మౌత్ టాక్‌తో మరింత దూసుకుపోతుందని మూవీ యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 16, 2024, 11:41 AM IST
Kalinga Movie: కళింగ మూవీ రిజల్ట్‌పై చిత్రబృందం రియాక్షన్ ఇదే..!

Kalinga Movie Success Meet: కిరోసిన్ మూవీతో సక్సెస్ అందుకున్న హీరో ధృవ వాయు.. ఇప్పుడు కళింగ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం కూడా వహించారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఈ నెల 13న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో, డైరెక్టర్ ధృవ వాయు మాట్లాడుతూ.. మౌత్ టాక్‌తో తమ సినిమా అందరికీ చేరువ అవుతోందని చెప్పారు. ప్రేక్షకులు చిత్రాన్ని ఇష్టపడడం ఆనందంగా ఉందన్నారు. కంటెంట్ ఉంటే సినిమాను హిట్ చేస్తారని తెలుగు ప్రేక్షకులు నిరూపించారని అన్నారు.

Also Read: Shani Transit: ఈ రాశుల వారిపై శని దేవుడి అశుభ దృష్టి తొలిగింపు.. పెళ్లి కానీ ప్రసాద్ లకు  వివాహా యోగమే..!

ప్రొడ్యూసర్ దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. డైరెక్టర్ ఈ మూవీ మీద ముందు నుంచీ ఎంతో నమ్మకంగా ఉన్నారని.. ఆయన వల్లే మూవీ గొప్పగా వచ్చిందన్నారు. సినిమాను సూపర్ హిట్ చేసిన ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్పారు. నిర్మాత పృథ్వీ యాదవ్ మాట్లాడుతూ.. కళింగ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ.. తనను ప్రేక్షకులంతా కూడా పద్దు అనే పిలుస్తున్నారని.. తన పాత్రకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మూడు సంవత్సరాలు ఈ మూవీ కోసం వర్క్ చేశానని.. ఈ సక్సెస్ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్ చెప్పారు.

సస్పెన్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన కళింగ మూవీ ప్రస్తుతం థియేటర్‌లలో సందడి చేస్తోంది. డిఫరెంట్‌గా స్టోరీ రాసుకున్న ధృవ వాయు.. అద్భుతంగా తెరపై చూపించారు. కళింగ ఊరుకు ఉన్న శాపం.. పొలిమేర దాటితే జరిగే అనర్థాలను చక్కగా చూపించారు. ఆ ఊరి పోలిమేర దాటిన వారు ఎందుకు చనిపోతున్నారు..? దీని వెనుక ఏమైనా శక్తులు ఉన్నాయా..? లేదా ఎవరైనా కావాలనే చంపుతున్నారా..? అనే సస్పెన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. దర్శకుడిగా.. నటుడిగా ధృవ వాయుకు మంచి మార్కులే పడ్డాయి.

Also Read: AP Medical Admission Quota: ఏపీ మెడికల్ అడ్మిషన్ల మొదటి విడత కన్వీనర్ కోటా విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News