Hyderabad Rains: కొన్ని వారాలు తెరపినిచ్చిన వరుణుడు మళ్లీ హైదరాబాద్‌లో జూలు విదిల్చాడు. ఒక్కసారిగా హైదరాబాద్‌ను చుట్టూ ముట్టేశాడు. సాయంత్రం పూట మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగింది. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పలు సమయాల్లో కుండపోత వర్షం కురిసింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా వర్షం కురవడంతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరికొన్ని చోట్ల రోడ్లపై వరద పారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
నగరవ్యాప్తంగా వర్షాలు
హైదరాబాద్‌లోని ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, రాంనగర్, అడిక్‌మెట్, అశోక్ నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, కవాడిగూడ, ట్యాంక్‌బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కాచిగూడ, బర్కత్‌పుర, బషీర్‌బాగ్, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, తార్నాక, నాగోల్, బోడుప్పల్, కుత్బుల్లాపూర్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, సైదాబాద్, మాదన్నపేట్, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, మీర్‌పేట, జిల్లెలగూడ, ఆల్మస్‌గూడ, బడంగ్‌పేట్, బాలాపూర్, ఉప్పల్, రామంతపూర్, నాచారం, మల్లాపూర్, ఓయూ క్యాంపస్, లాలాపేట, మేడిపల్లి, ఫిర్జాదీగూడ, నారపల్లి, ఘట్‌కేసర్, సుచిత్ర, జీడిమెట్ల, గండిమైసమ్మ, బాచుపల్లి, కొంపల్లి, షాపూర్ నగర్, రాజేంద్రనగర్, ఉప్ప్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Also Read: Madhavi Latha: తిరుమలలో అత్యాచారం జరిగింది.. లడ్డూ వివాదంపై మాధవీలత వ్యాఖ్యలు
రేపు కూడా వర్షాలే
తెలంగాణలో.. హైదరాబాద్‌లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉదయం, సాయంత్రం పూట వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఉప్పర్‌పల్లి జలమయం
రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో శుక్రవారం కురిసిన వర్షానికి జలమయమైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక్కడ ఉన్న నాలా కబ్జా చేయడంతో ప్రతి చిన్నపాటి వర్షానికి ఇక్కడ రోడ్డు జలమయవుతోంది. జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.