AP Heavy Rains Alert in Telugu: ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజుల్నించి వేసవిని తలపించేలా పగటి ఉష్ణోగ్రత ఉంటోంది. అటు ఉక్కపోత కూడా అధికంగా ఉంటోంది. అయితే ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం తుపానుగా మారితే వర్షాల తీవ్రత పెరగవచ్చు. 

ప్రస్తుతం నైరుతి బంగాళాశాతంలో సముద్రమట్టానికి  3.1-5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది కాకుండా ఇవాళ అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈ ెల 23వ తేదీకు పశ్చిమ మద్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. దాంతో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆ తరువాత భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే అల్పపీడనం తుపానుగా మారవచ్చని గతంలో వచ్చిన వార్తలపై స్పష్టత వచ్చింది. తుపానుగా మారుతుందా లేదా అనేది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుందని ఐఎండీ తెలిపింది. తుపానుగా మారితే మరింతగా భారీ వర్షాలు పడనున్నాయి. 

ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రానున్న 4-5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి రుతు పవనాల ఉపసంహరణ కూడా ప్రారంభం కానుంది. దాంతో ఈశాన్య రుతు పవనాలు వీచేందుకు వాతావరణం అనుకూలం కానుంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. 

Also read: YS Jagan Comments: ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్.. ఆ విషయంలో చంద్రబాబు దిట్ట..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Andhra pradesh Weather Forecast low pressure in bay of bengal causes heavy rains in these districts for coming 4-5 days rh
News Source: 
Home Title: 

AP Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 4-5 రోజులు ఏపీలో భారీ వర్షాలు

AP Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 4-5 రోజులు ఏపీలో భారీ వర్షాలు
Caption: 
Low Pressure ( file photo)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
AP Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 4-5 రోజులు ఏపీలో భారీ వర్షాలు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, September 21, 2024 - 08:53
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
6
Is Breaking News: 
No
Word Count: 
221

Trending News