Tirumal Darshan Tickets Release For December 2024: తిరుమల తిరుపతికి సంబంధించి ప్రతి నెల దర్శనం, వసతి గృహంతో పాటు వివిధ సేవలకు సంబంధించిన టికెట్స్ కు కోటా విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా డిసెంబరు మంత్ కు సంబంధించి అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న ఈ రోజు ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో రిలీజ్ చేయనుంది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన ఆన్ లైన్ కోటాను 11 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
వయో వృద్ధులు, పెద్దలు, దివ్యాంగులకు సంబంధించిన నవంబర్ నెల ఫ్రీ దర్శన కోటా టికెట్స్ ను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. వివిధ వర్గాలు వాళ్లకు సంబంధించిన టైమ్ స్లాట్ లో ఆధార్ నంబర్ తో ఆయా సేవలకు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చుని తెలిపింది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
మరోవైపు సెప్టెంబర్ 24న మంగళవారం రోజున రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ బోర్డ్ ఈ టికెట్స్ ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. మరోవైపు తిరుమలతో పాటు తిరుపతిలో ప్రత్యేక గదుల కేటాయింపు కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు.
సెప్టెంబర్ 27న శ్రీవారి సేవ కోటా టికెట్స్ ను ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. నవీనీత సేవను మధ్యాహ్నం రెండు గలంకు.. పరకామణి సేవ టికెట్స్ ను మధ్యాహ్నం ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నట్టు ఓ ప్రకటనలో టీటీడీ తెలిపింది.
మోవైపు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.