AP Nominated Posts: ఏపీలో 20 నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు కీలక పదవీ..

AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేపట్టింది. ఈనేపథ్యంలో 20 నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో ముఖ్యంగా సామాన్యులకు పెద్దపీట వేశారు.. ఈ  నేపథ్యంలో పూర్తి జాబితా వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Sep 24, 2024, 02:52 PM IST
AP Nominated Posts: ఏపీలో 20 నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు కీలక పదవీ..

AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేడు నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేసింది. ఇందులో 20 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నియామకాలు చేపట్టింది. ఈ పోస్టుల భర్తీలో ముఖ్యంగా పార్టీ కోసం తీవ్రంగా కృషి చేసిన సామాన్యులకు పెద్దపీట వేసింది. వారికి కీలక పదవులను అప్పగించింది.  ఈ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

20 నామినేటెడ్‌ పోస్టుల్లో ముఖ్యంగా టీడీపీ పార్టీకి 16 పోస్టులు, జనసేన పార్టీకి 3, బీజేపీ పార్టీకి ఒక్క పదవీ దక్కింది. అంతేకాదు ఈ పోస్టింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు మైనార్టీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. కొనకళ్ల నారాయణకు కూడా గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలి అనుకున్నారు కానీ, ఆ సీటు జనసేనకు వెళ్లింది. ప్రస్తుతం ఆయనకు ఆర్టీసీ ఛైర్మన్‌ పదవీ దక్కడం విశేషం.
 
20 నామినేటెడ్‌ పోస్టుల జాబితా..

ఆర్టీసీ ఛైర్మన్‌   కొనకళ్ల నారాయణ
ఏపీఐఐసీ ఛైర్మన్‌   మంతెన రామరాజు
20 సూత్రాలు అమలు కమిటీ ఛైర్మన్‌ లంకా దినకర్‌
శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు
వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్
హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్‌ తాతయ్యనాయుడు
ట్రైకార్ ఛైర్మన్‌ శ్రీనివాసులు
మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్‌ దామచర్ల సత్య
సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ సుబ్బారెడ్డి
సీడ్‌ ఏపీ ఛైర్మన్‌ దీపక్‌రెడ్డి
మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ బంగార్రాజు
ఏపీఐఐసీ ఛైర్మన్‌ రామరాజు
పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ అబద్ధయ్య
ఏపీ టూరిజం డెవపల్‌మెంట్‌ కార్పొరేషన్‌ బాలాజీ
ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ గోవింద సత్యనారాయణ
లెదర్ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ మాణిక్యాలరావు
ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్‌ పీతల సుజాత
ఏపీ ఎంఎస్‌ఎంఈ డీసీ తమ్మిరెడ్డి శివశంకర్
సివిల్‌ సప్లైస్ కార్పొరేషన్‌ సీతారామ సుధీర్
ఏపీ ట్రేడ్‌ ప్రొమోషన్‌ కార్పొరేషన్‌ బాబూరావు
ఏపీ టిడ్కో అజయ్‌కుమార్‌

 

ఈసారి ఎలాగైనా పదవీ దక్కించుకోవాలి అని ఎంతో మంది ప్రయత్నించారు. పార్టీలో క్షేత్రస్థాయి నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేపట్టింది. ఈ సందర్భంగా టీడీపీతోపాటు జనసేన, బీజేపీకి కూడా పదవులు వరించాయి. ముఖ్యంగా చాలామంది టీడీపీ సీనియర్లు నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూశారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల పోటీలో టిక్కెట్ దొరకని నేతలు నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ఎదురు చూశారు.

 

ఇదీ చదవండిసనాతన ధర్మం జోలికి రావోద్దు.. ఇంద్రకీలాద్రి సాక్షిగా మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో..

 

ఇదీ చదవండి: టెట్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఒకే ప్రాంతంలో ఎగ్జామ్‌ సెంటర్‌, సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన నంబర్లివే..
  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News