Danam Nagender: దానం నాగేందర్‌ సంచలనం.. పేదల జోలికి వెళ్లకూడదని హైడ్రాకు ముందే చెప్పా..

Danam Nagender On Hydra: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి వెళ్లకూడదని అప్పుడే చెప్పానన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపనిది వారి ఇళ్లను కూల్చకూడదని, ముందే పేదల జోలికి వెళ్లకూడదని హైడ్రాకు ముందే చెప్పానని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చెప్పారు.

Written by - Renuka Godugu | Last Updated : Sep 29, 2024, 01:38 PM IST
Danam Nagender: దానం నాగేందర్‌ సంచలనం.. పేదల జోలికి వెళ్లకూడదని హైడ్రాకు ముందే చెప్పా..

Danam Nagender On Hydra: జలవిహార్‌, ఐమ్యాక్స్‌ వంటివి ఉండగా.. పేదల ఇల్లు కూల్చడం సబబు కాదని ఎమ్మెల్యే దానం ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. మా ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని, చెడ్డపేరు తీసుకు రాకూడదని చెప్పారు. ముఖ్యంగా ఇతర పార్టీలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

మూసీ నాలల పరివాహాక ప్రాంతాల్లో ఉన్నవారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ప్రత్యామ్నాయం చూపి అక్కడి నుంచి తరలించాలని కోరారు. అకాల వర్షాలు పడినప్పుడు మూసీ నది ప్రమాదం స్థితికి చేరుకుంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదమని ముఖ్యమంత్రి గారు మూసీ ప్రక్షాళన చేపట్టారు. పేదల గుడిసెల జోలికి వెళ్లకూడదని నేను చెబితే నేనే కబ్జా చేస్తున్నానని మీడియాలో చెప్పారు. హైదరాబాద్‌లో ఏం జరిగినా మేమే ముందుండి పోరాడాం. అందుకే మా వద్దకు వందల సంఖ్యలో హైడ్రా బాధితులు వచ్చి మొర పెట్టుకుంటున్నారు. నా వంతు ప్రయత్నం చేస్తా.  ఇప్పటికే సీఎం కూడా దాన కిశోర్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో కూడా మాట్లాడారన్నారు.

జలవిహార్‌ నీటిలో ఉంది దాని సంగతి ఏంటి? అని బీఆర్‌ఎస్‌ పార్టీని నిలదీశారు. శవాల మీద ప్యాలాలు ఏరుకునే పని చేస్తున్నారు. ప్రజలను హరీష్‌ రావు తెలంగాణ భవన్‌కు ఎందుకు పిలిపించుకుంటున్నాడని ప్రశ్నించారు. ప్రభుత్వం మొండిగా కూల్చితే వచ్చి అడ్డంగా నిలబడతారా? అన్నారు. ఈటెల కూడా చేసేదేం లేదు, ఆయన ప్రయత్నాలు కేవలం బీజేపీ అధ్యక్షుడు కావాలని మాత్రమే, మీ పని మీరు చేసుకోండి. ఆరుసార్లు ఎన్నికయ్యాం పేద ప్రజలకు మేము అండగా ఉంటాం, పునరావాసం కల్పిస్తాం.

ఇదీ చదవండి:  బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త రీఛార్జీప్లాన్‌.. ప్రతిరోజూ 1 జీబీ డేటా, 60 రోజుల వ్యాలిడిటీ ఎంత తక్కువ తెలుసా?  
అప్పట్టో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా కూల్చివేతలకు పాల్పడితే రేవంత్‌ అడ్డుకున్నారు. మరి ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తే మీరు అడ్డుకుంటున్నారు. మీ వైఖరి ఎప్పటి కప్పుడు మారుతూ ఉంటుందా? అని ప్రశ్నించారు. సొంత కార్యకర్తలతో ముఖ్యమంత్రిని, వారి కుటుంబాన్ని తిట్టడం వంటివి చేయిస్తున్నారు.శిఖం ల్యాండ్‌లో పది ఫ్లోర్‌ల బిల్డింగ్‌కు కేటీఆర్‌ పర్మిషన్‌ ఇచ్చారు. వాళ్లు ఎందుకు ఇచ్చారు.

ఇదీ చదవండి:  కమిషనర్‌ రంగనాథ్‌పై కేసు నమోదు.. హైడ్రా అంటే బూచీ కాదు భరోసా అంటున్న ఎండీ దాన కిషోర్‌..
ముఖ్యమంత్రి ఏదైనా చేయగలుగుతారు ఇతర పార్టీలు ముసలి కన్నీరు కారుస్తూ పబ్బం గడుపుతాయన్నారు. మూసీ పరివాహాక ప్రాంతంలో ఉన్నవారికి అక్కడే పునరావాసం కల్పించడానికి ప్రయత్నిస్తాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రజాభవన్‌కు పిలిచి హామి ఇవ్వాలని పీసీపీ అధ్యక్షుడు మహేశ్‌కు కూడా చెప్పానని అన్నారు. పేదలు వారి ఇల్లు కూలుస్తున్నారని బాధ భరించలేక వారు తిడుతున్నారని మేం అర్థం చేసుకున్నాం, ప్రజల ఆవేదన పత్రిక రూపంలో వస్తుంది. దీన్ని అర్థం చేసుకున్నాం. అందుకే నేను పేద ప్రజలకు అండగా ఉంటారు. మీ పక్షాన ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా ఉంటారు. ఇతర పార్టీల ముసలి కన్నీరుకు మోసపోకూడదని చెప్పారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News