Popular Business Ideas: పెట్టుబడి తో పనిలేదు ఈ మూడు లక్షణాలు ఉంటే చాలు.. ఈ బిజినెస్ లో నెలకు కోటి సంపాదించే అవకాశం

Business Ideas: ఉన్న ఊరిలోనే మంచి బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ లాభం అందించే బిజినెస్ చేయాలని ఉందా?  ఓ చక్కటి బిజినెస్ ఐడియా ఇప్పుడు మీకోసం ముందుకు తెచ్చాము. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఈ బిజినెస్ ద్వారా మీరు అతి త్వరలోనే మీ జీవితంలో స్థిరపడే అవకాశం లభిస్తుంది. అలాంటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Bhoomi | Last Updated : Sep 29, 2024, 03:53 PM IST
Popular Business Ideas: పెట్టుబడి తో పనిలేదు ఈ మూడు లక్షణాలు ఉంటే చాలు.. ఈ బిజినెస్ లో నెలకు కోటి సంపాదించే అవకాశం

Most Popular Business Ideas:  మీరు తక్కువ పెట్టుబడి లోనే మంచి బిజినెస్ కోసం చూస్తున్నట్లయితే ఈవెంట్ మేనేజ్మెంట్ ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మహానగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక చక్కటి బిజినెస్ గా మారింది. మీ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ నుంచి పెళ్లి వరకు సినిమా ఆడియో ఫంక్షన్ నుంచి పొలిటికల్ లీడర్ మీటింగ్ వరకు కాలేజీలో ఫెస్టివల్ నుంచి అవార్డుల ఫంక్షన్ వరకు ఇలా ప్రతి ఒక్క సందర్భానికి ఈవెంట్ జరపడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

 అయితే ప్రతి ఒక్కరు తమకు తాముగా ఈవెంట్ను ఆర్గనైజ్ చేసుకోవడం చాలా కష్టతరమైన పని అందుకే ఈవెంట్ ను సక్సెస్ఫుల్గా చేయడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే మార్కెట్లో పలు రకాల ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఏ సందర్భాన్ని వదలకుండా అన్ని సందర్భాల్లోనూ ఈవెంట్ నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

ముందుగా మీరు నిరుద్యోగులై మీ ఖాళీ సమయాల్లో డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ కోసం ఒక కంపెనీని రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ కంపెనీ పైన ఆఫీసును ఓపెన్ చేసి మీరు ఈవెంట్ నిర్వహణకు అవసరమైన వ్యక్తులతో కాంటాక్టులు సిద్ధం చేసుకోవాలి.

Also Read: Success Story : చెట్టు కింద కూర్చుంటే వచ్చిన ఒక ఐడియా.. ఆయన జీవితాన్నే మార్చేసింది.. నేడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే శాసిస్తున్నాడు  

ఉదాహరణకు క్యాటరింగ్ షామియానా లైటింగ్ ఇతర సదుపాయాలు కల్పించే వారితో మీరు ఒక టీం ను తయారు చేసుకోవాలి. ఆ విధంగా టీం తయారయ్యాక ఫంక్షన్ లో నుంచి ఆర్డర్లను తీసుకోవాల్సి ఉంటుంది. మొదట్లో బర్త్డే ఫంక్షన్ లు లాంటివి చిన్న చిన్న ఫంక్షన్లను నిర్వహించడం ద్వారా మీరు అనుభవం సంపాదించుకోవచ్చు. మీరు అందించే సర్వీసు కష్టమర్ కు సంతృప్తి కలిగించాలి. అప్పుడు వారు పెట్టిన పెట్టుబడికి ఆనందం లభిస్తుంది. తద్వారా మీకు ఇతర ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది.

మీరు ఈవెంట్ నిర్వహణ విషయంలో ఖచ్చితత్వాన్ని పాటించాలి. ఉదాహరణకు వివాహాది మహోత్సవాలకు ఈవెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసినప్పుడు టైం విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. ఎందుకంటే అలాంటి మహోత్సవాలు ముహూర్తం ఆధారంగా ఉంటాయి. అందుకే క్యాటరింగ్ కానీ డెకరేషన్ కానీ లైటింగ్ ఇతరత్రా సదుపాయాలన్నీ కూడా ముహూర్త సమయానికల్లా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు.

ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ లో అసలైన పెట్టుబడి నిజాయితీ సమయపాలన డిసిప్లిన్ అని తెలుసుకోవాలి. కస్టమర్ కు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించేలా ఎప్పటికప్పుడు ఈవెంట్ను డిజైన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అతను పెట్టిన పెట్టుబడికి సంతృప్తి చెందుతాడు.

Also Read: Gold Rate Today: హమ్మయ్య.. బంగారం ధర శాంతించిందోచ్..ఎంత తగ్గిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News