Mukesh Ambani chef Salary: మరో జన్మంటూ ఉంటే అంబానీ ఇంట్లో వంటోడిగా పుట్టాల్సిందే.. జీతం ఎంతో తెలిస్తే షాకే

Mukesh Ambani: ఆగర్భ శ్రీమంతుడు, ఆసియా నెంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ గురించి ప్రతీ విషయం తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఆహారపు అలవాట్లు, కార్లు, అభిరుచుల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు వంట చేసే చెఫ్ గురించి తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Sep 29, 2024, 04:55 PM IST
Mukesh Ambani  chef Salary: మరో జన్మంటూ ఉంటే అంబానీ ఇంట్లో వంటోడిగా పుట్టాల్సిందే.. జీతం ఎంతో తెలిస్తే షాకే

Mukesh Ambani and Nita Ambani's chef : ముకేశ్ అంబానీ.. ఆయన పేరే ఒక బ్రాండ్. రిలయన్స్ సామ్రాజ్యానికి అధినేతగా ఉన్న ముఖేష్ అంబానీ ఇంట్లో.. ఏ చిన్న సంఘటన జరిగినా న్యూస్ హెడ్ లైన్ అవుతుంది. ముకేశ్ అంబానీ ఇంట్లో వివాహం జరిగిన లేదా మరే ఇతర శుభకార్యం జరిగినా కూడా ప్రపంచమంతా కూడా కదలి వస్తుంది అనడానికి ఇటీవల ఆయన చిన్న కుమారుడి వివాహ వేడుకలను ఉదాహరణగా చెప్పవచ్చు.  అలాంటి ముకేశ్ అంబానీ తరచూ తన జీవనశైలితో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు.  తాజాగా ముఖేష్ అంబానీ కి చెందిన పర్సనల్ వంట మనిషి జీతం ఎంత అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.  దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కథనాలు వడ్డిస్తున్నారు. 

 నిజానికి గతంలో ముకేశ్ అంబానీ నివాసం ఉండే భవనం గురించి దాదాపు అన్ని మీడియా సంస్థలు విస్తృతంగా కవర్ చేశాయి.  ఇక ఆ తర్వాత ఆయన డ్రైవర్ గురించి.. ఆయన కారు గురించి.. ముకేశ్ అంబానీ ధరించే దుస్తులు.. ముఖేష్ అంబానీ తినే ఆహారము.. ఇలా ముఖేష్ అంబానికి సంబంధించిన ప్రతి విషయం వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తూ ఉండటం సహజమే.  అయితే తాజాగా ఆయన వంట మనిషి గురించి జరుగుతున్న చర్చలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.

స్వతహాగా శాఖాహారి అయిన ముకేశ్ అంబానీ.. ఎక్కువగా దక్షిణాది ప్రాంతానికి వంటలు తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.  ముఖ్యంగా ఇడ్లీ, సాంబార్, దోశ, వడ వంటి ఆహారాలను తినేందుకు ముకేశ్ అంబానీ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. దీనికి సంబంధించి ఆయనకు ప్రత్యేకమైనటువంటి చెఫ్ సైతం ఉన్నారు. ఆయన ప్రతిరోజు కేవలం ముకేశ్ అంబానికి మాత్రమే ఆహారాన్ని తయారు చేస్తారు.

Also Read: Israel Hezbollah War: హిజ్బుల్లాకు బిగ్ షాక్.. వైమానిక దాడిలో కీలక నేత నబిల్ కౌక్ హతం  

 ఇందుకోసం ఆ వంట మనిషికి ప్రతి నెల 2 లక్షల రూపాయల జీతంతో పాటు.. వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భీమా అలాగే విద్యకు సంబంధించిన ప్యాకేజీలను అదనపు ప్రయోజనాలను అందిస్తున్నారు. ముకేశ్ అంబానికి ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్ స్వాతి స్నాక్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో పాటు ముఖేష్ కు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని పలుమార్లు ఆయన పార్సిల్ తెప్పించుకొని తినేవారని కూడా మిగతా అంబానీ ఓ సందర్భంగా చెప్పారు.

ముఖేష్ అంబానీ కి వంటచేసే ఆ వ్యక్తి నివాసం సైతం వారు నివసిస్తున్న యాంటీలా లోనే ఉంటుంది. ఇక ముఖేష్ అంబానీ స్వతహాగా దక్షిణాది మంటలతో పాటు భోజనం మాత్రం గుజరాతి స్టైల్లో చేసేందుకు ఇష్టపడతారు. ఆయన భోజనంలో ఎక్కువగా దాల్ రాజ్మా వంటి ప్రోటీన్ ఉండే పప్పు ధాన్యాలు ఉంటాయి. అలాగే ఆయన ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా వారికి భారతీయ రుచులను చూపించేందుకు ఆయన ఇష్టపడతారు. ముఖ్యంగా స్వీట్స్ విషయంలో ముకేశ్ అంబానీ చాలా కచ్చితంగా ఉంటారని తమ ఇంటికి వచ్చిన అతిథులకు స్వీట్లతో స్వాగతం పలుకుతారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు.

Also Read: Popular Business Ideas: పెట్టుబడి తో పనిలేదు ఈ మూడు లక్షణాలు ఉంటే చాలు.. ఈ బిజినెస్ లో నెలకు కోటి సంపాదించే అవకాశం  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News