CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 6, 2024, 08:25 PM IST
  • అభ్యర్థులకు నియామక పత్రాలిచ్చిన రేవంత్..
  • మరోసారి బీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు..
CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..

cm revanth reddy again fires on ktr and harish rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. ఈ కార్యక్రమం శిల్పాకళావేదికలో ఘనంగా జరిగింది. అదే విధంగా గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని సీఎం రేవంత్ అన్నారు నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం..   అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం బాధ్యతగా భావించలేదని విమర్శించారు.

ఉద్యోగాల కోసం నిరీక్షించి నిరీక్షించి.. నిరుద్యోగులు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతంలో ఎన్నికల సమయంలో.. బీఆర్ఎస్ వాళ్ల ఉద్యోగాలు పోతేనే..అందరికి జాబ్ లు వస్తాయని చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు అందరికి ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని నోటిఫికేషన్ లు వేస్తామని ప్రకటించారు. తెలంగాణాలో.. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90 రోజుల్లోనే మేం ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిట్లు వెల్లడించారు. 

దసరా పండగ నేపథ్యంలో తెలంగాణలో ప్రతీ కుటుంబంలో ఆనందం చూడాలని ఈరోజు మరిన్ని నియామక పత్రాలు అందించినట్లుపేర్కొన్నారు. ఈరోజు.. 1635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలుస్తోంది. వందలాది మంది ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ యువత కలలు సాకారమౌతున్నాయన్నారు.  

తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారని కొనియాడారు. ఇది కేవలం.. ఉద్యోగం మాత్రమే కాదు.. ఇది భావోద్వేగమన్నారు.మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని ఇంజనీర్లు పనిచేయాలన్నారు.

హైదరాబాద్ లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన అద్భుత కట్టడాలు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు. వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు..అంటూ బీఆర్ఎస్ మీద మండిపడ్డారు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. అక్టోబర్ 9న  11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

మూసీ  ప్రక్షాళనపై వ్యాఖ్యలు..

అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మూసీ  ప్రక్షాళన మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా..  మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగబోతుందని కుండబద్దలు కొట్టినట్లు సీఎం చెప్పారు. మూపీ ప్రజలు కంపులోనే బ్రతకాలా అని ప్రశ్నించారు. మూసీ పరివాహక  ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును ఇద్దామన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారు కావాలని ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు.

Read more: Hyderabad: హైదరాబాదీలు ఎగిరి గంతేసే వార్త.. పండగ వేళ అదిరి పోయే ఆఫర్ ఇచ్చిన సీఎం రేవంత్ సర్కారు.. డిటెయిల్స్..

హరీష్ రావు, ఈటల, కేటీఆర్ లు ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు. ఇలా వచ్చి అలా వెళ్లడం కాదని.. ధైర్యం ఉంటే కేసీఆర్, హరీష్, ఈటల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండాలని సవాల్ విసిరారు. అప్పుడు మాత్రంమే మూపీ ప్రజల కష్టాలు తెలుస్తాయని రేవంత్ అన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News