Aara Masthan Vali: ఏపీ ఎన్నికల ఫలితాలు, ఫామ్ 20పై కలక వ్యాఖ్యలు చేసిన ఆరా మస్తాన్ వలీ

Aara Masthan Vali: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ ఆరా అంచనా తొలిసారి తప్పింది. అప్పట్నించి మౌనంగా ఉన్న ఆరా మస్తాన్ వలీ తొలిసారిగా నోరు విప్పారు. టెక్నికల్ అంశాలు ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 7, 2024, 02:57 PM IST
Aara Masthan Vali: ఏపీ ఎన్నికల ఫలితాలు, ఫామ్ 20పై కలక వ్యాఖ్యలు చేసిన ఆరా మస్తాన్ వలీ

Aara Masthan Vali: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధించనుందని స్పష్టంగా చెప్పిన ఆరా సంస్థ అంచనాలు తొలిసారిగా తప్పాయి. అనూహ్యంగా కూటమి అధికారంలో వచ్చింది. 110 సీట్లతో అధికారంలో వస్తుందనుకున్న వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. 

వాస్తవానికి ఆరా సంస్థకు ఎన్నికల ఫలితాల విశ్లేషణలో 15 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఆ సంస్థ చేసిన సర్వేల్లో అన్నీ నిజమయ్యాయి. ఏదీ తప్పలేదు. ఎందుకంటే ఆరా మస్తాన్ వలీ చేసిన సర్వే అంత కచ్చితంగా ఉంటుంది. ఈసారి కూడా 110 సీట్లు గెల్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలో వస్తుందని ఆరా మస్తాన్ వలీ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 164 సీట్లు దక్కించుకుంటే వైసీపీ కేవలం 11 సీట్లే సాధించింది. సర్వే విఫలం కావడంతో ఆరా మస్తాన్ వలీ ఇప్పటి వరకూ మౌనం వహించారు. సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ జరిగినా నోరు విప్పలేదు. కానీ తొలిసారిగా ఇప్పుడు స్పందించారు. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల చర్చ నడుస్తున్న సమయంలో ఆరా మస్తాన్ వలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా మాట్లాడిన ఆయన కొత్త చర్చకు దారీ తీసే వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ జరిగిన తరువాత ఫామ్ 20ని అధికారిక వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పోలింగ్ ముగిసిన 48 గంటల్లో ఫామ్ 20 వెబ్‌సైట్‌లో పెట్టాలని గుర్తు చేశారు. కానీ 100 రోజుల తరువాత తిరుమల లడ్డూ వివాదం జరుగుతుండగా ఎందుకు అప్‌లోడ్ చేశారని నిలదీశారు. సరిగ్గా తిరుమల లడ్డూ వ్యవహారం జరుగుతుండగా చడీచప్పుడు లేకుండా అప్ లోడ్ చేశారు.

Also read: AP Fact Check: ఏపీలో మళ్లీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, మొత్తం 30 జిల్లాలు కొత్త జిల్లాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News