Mutyalamma Temple: ముత్యాలమ్మ విగ్రహాం ధ్వంసం.. రంగంలోకి దిగిన రాజాసింగ్.. సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వీడియో వైరల్..

Mutyalamma idol vandalised: సికింద్రాబాద్ లోని దుర్గమ్మ ఆలయం ను ఒక వర్గానికి చెందిన వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం హైదరబాద్ లో పెనుదుమారంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 14, 2024, 07:32 PM IST
  • మోండా మార్కెట్ లో టెన్షన్ టెన్షన్..
  • రాజాసింగ్ సీరియస్..
Mutyalamma Temple: ముత్యాలమ్మ విగ్రహాం ధ్వంసం.. రంగంలోకి  దిగిన రాజాసింగ్.. సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వీడియో వైరల్..

Mutyalamma idol temple vandalised incident secunderabad: సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయంలోని దుర్గమ్మ ఆలయంను ఒక వర్గానికి చెందని వ్యక్తి కాలితో తన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది.  దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. నవరాత్రులలో ఎంతో భక్తితో కోలుచుకునే తమ అమ్మవార్నికాలితో తన్నాడని,అతనిపై కఠిన చర్యలు తీసుకొవాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం వైరల్ గా మారడంతో పెద్ద ఎత్తున హిందు సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నాయి .

 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అక్కడికి చేరుకున్నారు. ఘటనపై ఆరాతీశారు. నిందితుడ్ని పట్టుకుని ఇప్పటికే అక్కడి వాళ్లు దేహాశుధ్దిచేసి పోలీసులకు అప్పగించారు.ఈ క్రమంలో ఇప్పటికే హైదరబాద్ అంతట ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడిందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా..  ఈ ఘటనపై బీజేపీ మాధవీలత కూడా ఖండించారు. మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఎక్స్ వేదికగా ఈ  ఘటనను ఖండిచారు. దీనిపై గోషా ఎమ్మెల్యే రాజా సింగ్ మాత్రం సీరియస్ గా స్పందించారు.

ఒక వర్గానికి చెందిన వారు తమ దేవతల్ని, అమ్మాయిల్ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని మండిపడ్డారు. ఘటన స్థలంలో వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తుంటే.. పోలీసులు రాజాసింగ్ ను హౌస్ అరెస్ట్ చేశారు.

Read more: Ammavari Idiol Damaged: అమ్మవారి విగ్రహం ధ్వంసం.. మోండా మార్కెట్ లో హైటెన్షన్..

సికింద్రాబాద్ మోండి మార్కెట్ లో అమ్మవారి ఆలయంను ధ్వంసం చేయడం దారుణమన్నారు. అందరు పొలిటిషియన్స్ లను అనుమతి ఇచ్చారని, తనను మాత్రం టెర్రరిస్టుగా ఎందుకు ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, కమిషనర్ లు వెంటనే ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News