Fuel Saving Tips For Bike Riders : బైక్ నడిపే సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే..మైలేజీ పెరగడం పక్కా

Fuel Saving Tips For Bike Riders : మీ బైక్ మైలేజీ తక్కువగా ఇస్తుందా? మీ బైక్ మైలేజీ పెరగాలంటే..ఈ తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో చూద్దాం. 

Written by - Bhoomi | Last Updated : Oct 16, 2024, 03:42 PM IST
Fuel Saving Tips For Bike Riders : బైక్ నడిపే సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే..మైలేజీ పెరగడం పక్కా

Fuel Saving Tips For Bike Riders : కొత్త బైక్ అయితే కొన్న కొత్తలో మంచి మైలేజీ ఇస్తుంది. కానీ బైక్ పాతబడుతున్నా కొద్దీ దాని ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ తగ్గుతుంది. దీంతో బైక్ పెట్రోల్ విపరీతంగా తాగుతుంది. దీంతో మీ జేబుకు చిల్లుపడుతుంది. అందుకే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వాలి. అప్పుడే మీ బైక్ మంచి మైలేజ్ ఇస్తుంది. 

పెట్రోల్ సేవ్ చేయాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాలి:

- బైక్ ఎప్పుడూ కూడా స్టడీ స్పీడ్ లో డ్రైవ్ చేయాలి. దీంతో కచ్చితంగా పెట్రోలు ఆదా అవుతుంది. అలా కాకుండా స్పీడ్ గా నడిపిస్తూ, తగ్గిస్తూ ఉంటే ఇంజిన్ పై ప్రభావం పడుతుంది. దీంతో పెట్రోలు ఎక్కువ ఖర్చు అవుతుంది. 

-బైక్ నడిపేటప్పుడు టైర్ ప్రెజర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే బండి డ్రైవ్ చైన్ టెన్షన్ కూడా సరిగ్గా ఉండే విధంగా చూసుకోవాలి. సరిపడా టైర్ ప్రెజర్ లేనప్పుడు వేగంగా జిగ్ జాక్గా బైక్ డ్రైవ్ చేస్తే పెట్రోలు త్వరగా అయిపోతుంది. 

-కంపెనీ ఆథరైజ్డ్ సర్వీసు గ్యారేజీ లేదా వర్క్ షాప్ దగ్గర మాత్రమే ఇంజిన్ను ట్యూన్ చేయించాలి. అలాగే అక్కడే మీ బైకును క్రమం తప్పకుండా సర్వీసు చేయించుకోవాలి. దీంతో మీ బైక్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ బాగుంటుంది. 

-ఉద్గార లెవల్స్ ఎప్పుడూ కూడా తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ చిట్కాలుఫాలో అవుతే మీ టూ వీలర్ మంచి మైలేజీ ఇస్తుంది. పెట్రోల్ ఖర్చు కూడా బాగా ఆదా అవుతుంది. 

Also Read: Jabardast Chalaki Chanti: నా పొట్ట కొట్టినవాడి నాశనం చూశాకే చచ్చిపోతా.. జబర్దస్త్ చలాకీ చంటి షాకింగ్ కామెంట్స్   

ఈ తప్పులు అస్సలు చేయకూడదు : 

-బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు క్లచ్ లివర్ నొక్కి అలాగే ఉంచకూడదు. 

-లోగేర్ వేసి ఎక్కువ సేపు బండిని డ్రైవ్ చేయరాదు 

-మీ బండిని వీలైంతర వరకు ఎండలో ఉంచకూడదు. ఎందుకంటే సూర్యరశ్మికి పెట్రోల్ ఆవిరైవుతుంది. 

-బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్రేక్ పెడల్ పై కాలు వేసి నొప్పి ఉంచరాదు. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే బ్రేక్ పెడల్ ను నొక్కాలి. లేదంటే పెట్రోల్ ఎక్కుగా ఖర్చు అవుతుంది. 

-ట్రాఫిక్ లో ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆర్ పీఎంను అనవసరంగా పెంచవద్దు. 30 సెకన్ల కంటే ఎక్కువ బండిని ఆపాల్సి వస్తే మీ ఇంజిన్ ఆఫ్ చేయాలి. 

-ఎట్టి పరిస్థితిల్లోనూ కల్తీ ఇంధనం వాడకూడదు. 

Also Read: RBI Summer Internship 2024: రిజర్వ్‌ బ్యాంకు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌.. నెలకు రూ.20,000 స్టైఫండ్‌ పొందే సువర్ణావకాశం..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News