L2: Empuraan: లూసీఫర్ ప్రీక్వెల్ ‘L2 ఎంపురాన్’ పై భారీ అంచనాలు.. ప్రభాస్ దోస్త్ ఫస్ట్ లుక్ రిలీజ్..

L2: Empuraan: 2019 మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ లీడ్ రోల్స్ లో నటించిన ‘లూసీఫర్’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.తెలుగులో అదే పేరుతో డబ్ చేసి విడుదల చేస్తే ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు చిరు కూడా ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తే ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇపుడీ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘L2 ఎంపురాన్’ సినిమా తెరకెక్కుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 17, 2024, 01:05 AM IST
L2: Empuraan: లూసీఫర్ ప్రీక్వెల్ ‘L2 ఎంపురాన్’ పై భారీ అంచనాలు.. ప్రభాస్ దోస్త్ ఫస్ట్ లుక్ రిలీజ్..

L2: Empuraan: ‘లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమార్ ఈ  ప్రీక్వెల్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా నటిస్తూన్న ఈ చిత్రంలో సౌత్ స్టార్‌లు నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్  హిట్ కావ‌టంతో సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో ముందుగానే అంచ‌నా వేసిన మేక‌ర్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోహ‌న్ లాల్‌, వెర్స‌టైల్ యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రానున్న మూడో చిత్రం కావ‌టంతో అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఇప్పటికే  మోహ‌న్‌లాల్ బర్త్ డే  సంద‌ర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్ర‌మ్‌గా సూప‌ర్‌స్టార్ లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఖురేషి అబ్రమ్‌కు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించబోతున్నారు. రీసెంట్ గా  రిలీజ్ చేసిన జయేద్ మసూద్ కారెక్టర్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.  

ఎంపరర్ జనరల్ అంటూ జయేద్ మసూద్ పాత్రను ఇండ్రడ్యూస్ చేశారు. ఈ చిత్రంలో టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు,సానియా అయ్య‌ప్ప‌న్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని లడఖ్, చెన్నై, కొట్టాయం, యుఎస్ మరియు యుకెతో సహా ప‌లు చోట్ల సినిమా చిత్రీకరణ జరుపుకుంది.  టీమ్ ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుపుకుంటోంది. త్వ‌ర‌లోనే గుజరాత్, యుఎఇకి కూడా టీమ్ వెళ్లబోతుంది. 2025లో మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ  సినిమాను విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News