Veekshanam Movie Review: ‘వీక్షణం’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా.. !

Veekshanam Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అందుకే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ కోవలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వీక్షణం’. మరి  ఈ సినిమా ఎలా ఉందంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 19, 2024, 09:51 AM IST
Veekshanam Movie Review: ‘వీక్షణం’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా.. !

మూవీ రివ్యూ: వీక్షణం (Veekshanam)

నటీనటులు: రామ్ కార్తీక్, కశ్వి, నక్షత్ర, చిత్రం శ్రీను, దయానంద్ రెడ్డి, గాంధీ సమ్మెట, నాగ మహేష్, షైనింగ్ ఫణి, పింగ్ పాంగ్ సూర్య త‌దిత‌రులు

ఎడిటర్: జెస్విన్ ప్రభు

సినిమాటోగ్రఫీ: సాయి రామ్ ఉదయ్

సంగీతం: సమర్ధ్ గొల్లపూడి

నిర్మాత:  పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి

దర్శకత్వం: మనోజ్ పల్లేటి

విడుదల తేది: 18-10-2024

రామ్ కార్తీక్, క‌శ్వి నాయికా, నాయకులుగా  నటించిన చిత్రం ‘వీక్షణం’.  ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి ఎంతో ప్యాషన్ తో నిర్మించారు.దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి డైరెక్ట్ చేసారు. మరి ఈ రోజు ప్రేక్షకల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను మెప్పించేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

హైదరాబాద్ లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు తన ఇంటి చుట్టు పక్కలా ఎవరు ఏం చేస్తున్నారనే తెలుసుకునే అలవాటు ఉంటుంది. తన దగ్గరున్న బైనాకులర్స్ తో అందరి ఇళ్లలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో  తన ఇంటి దగ్గర ఓ ఇంట్లో నేహా (కశ్వి)ని చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వస్తాయి. దీంతో అర్విన్ తన ఫోకస్ మరో ఇంటిపై పెడతాడు. అక్కడ అనూహ్యంగా అతనికి ఓ యువతి అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఆమె ఇంటికి రోజు ఎవరో వస్తూ పోతుంటారు. ఈ క్రమంలో ఆమె గురించి తెలుసుకుందామని ఆమె ఇంటికి వెళితే.. ఆమె చనిపోయి ఎనిమిది నెలలు అవుతుంది. మరి రోజు బైనాకులర్స్ తో తను చూసింది ఎవరు.. ? ఆమె ఇంటికి రోజు వచ్చేది ఎవరు.. ? మరి ఆమెది ఆత్మహత్య.. ? హత్యనా.. ? దీని వెనక ఉన్న మిస్టరీని అర్విన్ ఎలా చేధించాడనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టైమన పని మన పని మనం చేసుకుపోవడమే  అని విక్టరీ వెంకటేష్ చెబితే ఆ మాటను పట్టుకుని ఈ స్టోరీని రాసుకున్నాడు డైరెక్టర్ మనోజ్. తన సినిమాలో హీరోకు తన పని కంటే పక్కవాళ్లు ఏం చేస్తున్నారనే దానిపై క్యూరియోసిటీ ఉంటుంది. అందుకే  సినిమా మొదలైనప్పటి నుంచి ఆ విషయం ఆడియన్స్ కు హత్తుకునేలా ప్రతి సీన్ ఏర్చి కూర్చాడు. పక్కవాళ్ల జీవితంలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే క్రమంలో హీరో ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసాడనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్.. అంతా రొటిన్ పద్ధతిలో రాసుకున్నాడు. ఇంటర్వెల్ నుంచి ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించాడు. దాన్ని చివర వరకు అదే టెంపోను దాదాపు కంటిన్యూ చేసాడు. మధ్యలో కొన్ని సీన్స్ బోర్ తెప్పించినా.. మెయిన్ స్టోరీపై ఇంట్రెస్ట్ తగ్గకుండా చూసుకున్నాడు.

ఇకసెకండాఫ్ లో  చనిపోయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? అని హీరో అతని ఫ్రెండ్స్ ఎలా కనుగొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసారనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా చూపించాడు.  ఇక క్లైమాక్స్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చే  రొటీన్ చిత్రాలకు  భిన్నంగా సెకండ్ పార్టీకి లీడ్ ఇచ్చేలా కథను రాసుకున్నాడు.  దర్శకుడికి ఫస్ట్ మూవీతోనే తన గట్స్ ఏంటో చూపించాడు. దర్శకుడి మంచి భవిష్యత్తు ఉంది.  మొత్తంగా చూసుకుంటే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు దాదాసు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

టెక్నికల్ టీం విషయానికి వస్తే...
ఈ సినిమాకు ఆర్ఆర్ తో ప్రాణం పోసాడు  సంగీత దర్శకుడు సమర్ద్. దర్శకుడు చెప్పే కథనానికి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ చిత్రాన్ని నిలబెట్టాడు. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ ను  క్యారీ చేయడంతో హెల్ప్ అయింది.   కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూపిస్తున్న సమయంలో కెమెరామెన్ పనితనం కనబడింది. ఎడిటర్ ఫస్టాఫ్ లో ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.  నిర్మాణ విలువలు పర్వాలేదు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

నటీనటుల విషయానికి వస్తే..
ఈ సినిమాలో హీరో పాత్రలో రామ్ కార్తీక్ చక్కగా  ఒదిగిపోయాడు. పక్క వాళ్ళ విషయాల మీద ఆసక్తి కనబరిచే ఓ కామన్ పక్కంటి కుర్రాడి పాత్రలా జీవించాడు. ఇక హీరోయిన్గా నటించిన కశ్వి ఒకపక్క అందాల ఆరబోస్తూనే తనదైన యాక్టింగ్ తో మెప్పించింది. బాలనటిగా తన అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన బిందు నూతక్కికి మంచి పాత్ర దొరికింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.  

ప్లస్ పాయింట్స్

కథనం,

ఇంటర్వెల్ బ్యాంగ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్

ఎడిటింగ్

అక్కడక్కడా లాజిక్ లేనీ సీన్స్

లాస్ట్ పంచ్.. ‘ వీక్షణం’.. ఎంగేజ్ చేసే థ్రిల్లర్..

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News