CM Revanth Reddy: కానిస్టేబుళ్లకు రూ.కోటి, ఐపీఎస్‌లకు రూ.2 కోట్లు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన..

Police Flag Day 2024: సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని,విధినిర్వహాణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. అంతే కాకుండా.. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Oct 21, 2024, 04:41 PM IST
  • సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
  • అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని హమీ..
CM Revanth Reddy: కానిస్టేబుళ్లకు రూ.కోటి, ఐపీఎస్‌లకు రూ.2 కోట్లు.. సీఎం రేవంత్ సంచలన  ప్రకటన..

Cm Revanth reddy big announcement to  martyrs family:  సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గోషామహాల్ లో జరిగింది.  ఈ నేపథ్యంలో పోలీసుల అమర వీరుల దినోత్సవం నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతే కాకుండా.. విధి నిర్వహాణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. అంతేకాకుండా.. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు.

గోషా మహాల్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  తెలంగాణలో విధినిర్వహాణలో అమరులైన సర్కారు ఉద్యోగులకు..  ర్యాంకులను బట్టి రూ. కోటి నుంచి రూ.2 కోట్ల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా.. పోలీసుల సంక్షేమ నిధికి ప్రతి ఏడాది రూ. 20 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. 

త్యాగానికి, సేవలకు పోలీసులు ప్రతీక అని కొనియాడారు.అదే విధంగా సమాజంలో పోలీసులు ఏది జరిగిన ప్రాణాలను తెగించి ముందుంటారని అన్నారు. పోలీసుల త్యాగాలు మరవలేనివని.. కేఎస్ వ్యాస్,ఉమేష్ చంద్ర, పరదేశీ నాయుడు వంటి అధికారుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణలో క్రైమ్ రేటును, డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకొవాలన్నారు. ఇకపై కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసులు డ్యూటీలో ఉండగా వీరమరణం పొందితే రూ. కోటి పరిహారం ఇస్తామని కూడా ప్రకటించారు.

Read more: Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..

ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులకు రూ. 1.25 కోట్లు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులకు రూ. 1.50 కోట్లు,  అదే విధంగా ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ. 2 కోట్లు పరిహారం ప్రభుత్వం నుంచి ఇస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ విధుల్లో ఉండగా.. అంగవైకల్యం పొందితే రూ. 50 లక్షలు, చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి సర్కారు కొలువు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.  ఇటీవల సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లో  ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాం ధ్వంసంపై కూడా మాట్లాడారు. దీన్ని కొంత మంది రాజకీయం చేస్తున్నారని ఇలాంటి ఘటనకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News