YS Jagan Mohan Reddy : రాజకీయ పద్మవ్యూహంలో జగన్ ఇరుక్కున్నారా..?

YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం జగన్ కు రాజకీయంగా ఇబ్బందులు మొదలయ్యాయా..? ఇక నుంచి జగన్ కు రాజకీయంగా పెను సవాళ్లు ఎదురుకాబోతున్నాయా..? ఒక వైపు పార్టీ నుంచి నేతల వలసలు మరోవైపు అధికార పార్టీ నుంచి సవాళ్లు మధ్యలో కుటుంబ వ్యవహారాలు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయా..? ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకున్నారా..? రాజకీయ పద్మవ్యూహం నుంచి బయటపడుతారా లేకా  మరో అభిమన్యుడు అవుతారా..?

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Oct 24, 2024, 03:38 PM IST
YS Jagan Mohan Reddy : రాజకీయ పద్మవ్యూహంలో జగన్ ఇరుక్కున్నారా..?

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా వరుసగా సవాళ్లు ఎదురవుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నాటి నుంచి జగన్ కు కష్టాలు తప్పడం లేదు. గడిచిన ఆరు నెలలుగా జగన్ తీవ్ర రాజకీయ ఒత్తడిలో ఉంటున్నారు. ఇటీవల ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాలు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో పాటు  జగన్ పై జరుగుతున్న రాజకీయ దాడిపై వైసీపీ క్యాడర్ కూడా టెన్షన్ పడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. ఒక వైపు అధికార పార్టీ వైసీపీ నీడలా వెంటాడుతుంది. మరోవైపు వైసీపీ కీలక నేతలు పార్టీకీ రాజీనామా చేస్తున్నారు.వీటికి తోడు కుటుంబ ఆస్తి వ్యవహారాలు జగన్ ను కునుకు లేకుండా చేస్తున్నాయి.

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే జగన్ ను టార్గెట్ చేశాయి. గత ప్రభుత్వంలో జరిగిన రాజకీయ వ్యవహారాలను బయటపెడుతూ వస్తన్నాయి. అందులో భాగంగా విశాఖలో జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషి కొండి ప్యాలెస్ వీడియోలు రిలీజ్ చేసి జగన్ ను రాజకీయంగా ఇరకాటంలో పడివేసే ప్రయత్నం చేసింది. అంతే కాదు జగన్ పార్టీకీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీంతో అసెంబ్లీలో వైసీపీ గొంతు వినిపించని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగానే వైసీపీకీ చెందిన కొందరు కీలక నేతలు పార్టీనీ వీడి అధికార పార్టీ వైపు వెళ్లడం మొదలు పెట్టారు. వైసీపీకీ రాజీనామా చేసిన వారిలో జగన్ కు అత్యంత సన్నిహితంగా మెదిలిన వారు కావడంతో జగన్ ను మరింత షాక్ కు గురి చేశాయి.

వైసీపీ కీ చెందిన ఎంపీలు మోపిదేవి,బీద మస్తాన్ లు  ఇద్దరూ వైసీపీతో పాటు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో రాజ్యసభలో వైసీపీకీ ప్రాతినిధ్యం వహించే ఎంపీల సంఖ్య తగ్గింది. ఇదే క్రమంలో కొందరు ఎమ్మెల్సీలు కూడా  పచ్చ కండువా కప్పుకున్నారు. ఇలా వైసీపీ ఓటమి చెందిన కొత్తలోనే గట్టి షాక్ లు తగిలాయి. మరొక ఆసక్తికర అంశం ఏంటంటే జగన్ కు బంధువు అందునా ఇంటి మనిషిగా ముద్ర ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం వైసీపీకీ రిజైన్ చేసి జనసేనలో చేరారు. బాలినేని తో పాటు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కూడా వైసీపీకీ గుడ్ బై చెప్పి జనసేనలో చేరారా. వీళ్లే కాదు మరి కొందరు కీలక నేతలు కూడా త్వరలో వైసీపీనీ వీడి టీడీపీ, జనసేనలో చేరుతారని రాజకీయ వర్గాల్లో జో్రుగా ప్రచారం జరుగుతుంది.

ఇలా నేతల వలసలతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతుంటే  మరి కొందరు నేతల తీరు జగన్ కు , పార్టీకీ తలవంపులు తెచ్చే విధంగా మారింది. ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, అనంత బాబు వ్యక్తిగత వ్యవహారాలు కూడా పార్టీకీ మరింత మైనస గా మారాయి. దీంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఒకవైపు ఉన్న నేతలే అధికార పార్టీ వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే పార్టీలో ఉన్నవారు  ఇలా పార్టీకీ చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తుండడంతో జగన్ కు నేతల తీరుతో డబల్ టెన్షన్ పట్టుకుంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్నంత సేపు ఏదీ పెద్ద సమస్యగా అనిపించలేదు కానీ  ఒక సారి అధికారం కోల్పోగానే ప్రతీది పెద్ద సమస్యగా మారుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది.

జగన్ ను టార్గెట్ మరో పెద్ద బాంబ్ ను టీడీపీ కూటమి సర్కార్ పేల్చింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం ఐన వెంకటేశ్వర స్వామి ప్రసాదంను జగన్ ప్రభుత్వం అపచారం చేసిందని కల్తీ చేసిందని టీడీపీ అధినేత చేసిన ఆరోపణలు ఆ పార్టీనీ ఉక్కిరి బిక్కిరి చేశాయి. చంద్రబాబు ప్రకటనతో యావత్ దేశం ఉలిక్కిపడిందది. వైసీపీ, జగన్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. లడ్డు కల్తీ వ్యవహారం జగన్ కు రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ రాజకీయాలతో కూడిన అంశం కావడం, అదే సమయంలో దేశ అత్యున్నత న్యాయ స్థానం జోక్యం చేసుకోవడంతో ఈ విషయంలో వైసీపీకీ కాస్తా ఊరట లభించింది. దీంతో తిరుమల లడ్డు గండం నుంచి బయటపడినట్టైంది.

తిరుమల అంశం మరవక ముందే జగన్ కు ఈ సారి కుటుంబ రూపంలో కొత్త తలనొప్పి వచ్చిపడింది. వైఎస్ కుటుంబంలో ఇప్పుడు ఆస్తుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. జగన్ తీరును నిరసిస్తూ ఏకంగా జగన్ తల్లి, సోదరి లేఖలు రాయడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఆస్తి కోసం సొంత తల్లి విజయమ్మ,చెల్లి షర్మిల పైనే జగన్ కేసులు పెట్టారనీ టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుందది. ఈ ఆస్తుల వ్యవహారం జగన్ కు కాస్తా ఇబ్బందకర పరిణామంగా మారుతుంది. సొంత కుటుంబ మనుషులపైనే కేసు పెట్టడం ఏంటి అని జగన్ తీరుపై సాధారణ జనాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఐతే ఇదంతా టీడీపీ కుట్ర అని జగన్ ఆయన సన్నిహితులు చెబుతున్నా..జనాలు మాత్రం ఎంత మేరు వారి మాటలను విశ్వసిస్తారో అన్నది మాత్రం సందేహంగా మారింది. 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జగన్ కు ఇలా వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని జగన్ కూడా మొండిగా ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ఇవి సహజమేనని గతంలో తాను ఇంత కన్నా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాని జగన్ తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. రాజకీయ కుట్రలో భాగంగా ఎదురయ్యే ప్రతి సవాళ్లను తాను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాని జగన్ అంటున్నారట. ఇదే  రాజకీయ కుట్రలో భాగంగా తాను జైలు శిక్ష కూడా అనుభవించానని  అంతకన్నా నాకు జరగాల్సిన నష్టం ఏందని జగన్ ధైర్యంగా చెబుతున్నారట. అంతే కాదు పార్టీ వలసలపై కూడా చాలా లైట్ గా తీసుకుంటున్నారట. ఉండే వాళ్లు ఉంటారు పదవుల కోసం ఆశపడే వారు పోతారు .  విశ్వసనీయత ఉన్న నేతలకే తన వెంట ఉంటారని జగన్ చెబుతున్నారు.ఇక కుటుంబ ఆస్తుల వ్యవహారం పై కూడా జగన్ తన దైన స్టైల్ లో స్పందించారు. ఇది ఏ కుంటుంబంలోనైనా ఉండే వ్యవహారమేనని చాలా సింపుల్ గా తేల్చేశారు. 

ఐతే ఇవన్నీ చూసిన వాళ్లు జగన్ ప్రస్తుతం రాజకీయ పద్మవ్యూహంలో ఇరుకున్నారని అంటున్నారు. రాజకీయంగా ఎదురయ్యే ఛాలెంజ్ లను అదే విధంగా కుటుంబ ఆస్తుల విషయంలో ఎదురయ్యే సవాళ్లను జగన్ మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కుంటారో అని రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతుంది. రాజకీయ పద్మవ్యూహం నుంచి జగన్ బయటపడుతారా లేక  మరో అభిమన్యుడుగా మిగిలిపోతారా అనేది మాత్రం భవిష్యత్తులోనే తేలనుంది. 

Read more: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News