Carrot Juice Health Facts In Telugu: క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ ఎతో పాటు బీటా కెరోటిన్, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు ఈ రసాన్ని తాగడం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గుండెను కూడా ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిచేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు రక్తపోటును నియంత్రించేందుకు, కండారాల సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. దీని కారణంగా ఎలాంటి సమస్యలైనా దూరమవుతాయి. ఇవే కాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
క్యారెట్ జ్యూస్ ప్రయోజనాలు:
కంటి ఆరోగ్యానికి మేలు:
క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగపరచడమే కాకుండా చూపును పెంచుతుంది. అంతేకాకుండా అంధత్వం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే కంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
క్యారెట్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సితో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అన్ని రకాల వ్యాధుల నుంచి విముక్తి కలిగిచేందుకు కూడా సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యానికి మేలు:
క్యారెట్ జ్యూస్‌లోని విటమిన్ సితో పాటు బీటా కెరోటిన్ చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా చర్మ ప్రకాశవంతంగా మారుతుంది.
క్యాన్సర్ నిరోధకం:
క్యారెట్ జ్యూస్‌లోని కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కన్యర్కు వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది:
క్యారెట్ జ్యూస్‌లోని ప్రోబయోటిక్స్ మధుమేహాన్ని నివారించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో లభించే గట్ బ్యాక్టీరియా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు:
క్యారెట్ జ్యూస్‌లోని పొటాషియంతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, గుండె జబ్బులకు కారణమయ్యే ప్రమాదకరమైన మూలకాలను శరీరంలో నుంచి క్లీన్ చేస్తాయి. అలాగే కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.