YS JAGAN vs SHARMILA :షర్మిలను జగన్ దూరం పెట్టడానికి కారణం ఇదా...జగన్ పై బాంబ్ పేల్చిన బ్రదర్ అనిల్ !

YS JAGAN vs SHARMILA : జగన్,షర్మిల ఆస్తుల వివాదం మరో మలుపు తిరగబోతుందా..? ఆస్తుల వివాదంలో షర్మిల భర్త, జగన్ బావ బ్రదర్ అనిల్  కామెంట్స్ కాకా రేపుతున్నాయా..? అసలు జగన్ కు షర్మిలకు గ్యాప్ రావడానికి కారణం అదేనా..?  జగన్ సీఎం అయ్యాక బ్రదర్ అనిల్ ను ఆ విషయంలో కంట్రల్ లో ఉండమని జగన్ వార్నింగ్ ఇచ్చారా..? అది నచ్చకే జగన్ పై బ్రదర్ అనిల్ ,షర్మిల గుర్రుగా ఉన్నారా..? 

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Oct 30, 2024, 05:08 PM IST
YS JAGAN vs SHARMILA :షర్మిలను జగన్ దూరం పెట్టడానికి కారణం ఇదా...జగన్ పై బాంబ్ పేల్చిన బ్రదర్ అనిల్ !

YS JAGAN vs SHARMILA : జగన్ ,షర్మిల ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. షర్మిల లేఖతో మొదలైన ఈ రచ్చలో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. ఆస్తుల వివాదంలో జగన్ మద్దతుగా వైసీపీ నేతలు మాట్లాడుతుండగా, షర్మిలకు అనుకూలంగా విజయమ్మ అండ్ కో మాట్లాడుతున్నారు. ఇలా జగన్,షర్మిలపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు బయపడుతున్నాయి. ఇదే క్రమంలో షర్మిల భర్త , జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఆస్తుల వివాదం తెరమీదకు రావడంతో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 

2019లో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ తీరు మారిందని బ్రదర్ అనిల్ ఆరోపించారు. ఏపీలో మతతత్వ కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారని అనిల్ బాంబ్ పేల్చాడు. జగన్ సీఎం అయ్యాక ఏపీలో సువార్త సభలు పెట్టాలని బ్రదర్ అనిల్ అనుకున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం దీనికి అనుమతి నిరాకరించాడని అనిల్ చెప్పాడు. వైఎస్ మరణం తర్వాత షర్మిల , తాను జగన్ కు అడుగడుగునా రాజకీయంగా అండగా ఉన్నామని అనిల్ చెప్పుకొచ్చాడు. అంతే కాదు 2019లో జగన్ సీఎం అవడానికి తన ప్రార్థనలు కారణమని అనిల్ అన్నాడు. అలాంటి తన మీటింగ్ లను  ఏపీలో వద్దని జగన్ చెప్పడంతో నేను షాక్ గురయ్యాను అని అనిల్ మీడియాతో అన్నాడు. ఏపీలో తన సభలకు ఎందుకు నిరాకరించాడో కూడా అనిల్ చెప్పాడు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. కేంద్ర పెద్దలతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన మీటింగ్ లతో బీజేపీ పెద్దలకు కోపం వస్తుందనే జగన్ మీటింగ్ లు వద్దన్నాడని అనిల్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

ఐతే ఇప్పటి వరకు ఆస్తు వ్యవహారంగా నడిచిన వైఎస్ కుటుంబ కథా చిత్రమ్ ఇప్పుడు కొత్త రంగు పులుముకుంది.ఒక రకంగా జగన్ కు షర్మిల కు మధ్య గ్యాప్ రావడానికి కూడా ఇదే పెద్ద కారణంగా తెలుస్తుంది. జగన్ సీఎం అయ్యాక బ్రదర్ అనిల్ కుమార్, షర్మిలలకు ఎక్కడా కూడా పెద్దగా  ప్రాధాన్యత ఉన్నట్లు కనిపించలేదు. బ్రదర్ అనిల్ కుమార్ ఐతే అడపా దడపా తప్పా ఎక్కడా కూడా పిక్చర్ లోనే లేడు. 2019 మందు వరకు జగన్ తో కనిపించే  షర్మిల, బ్రదర్ అనిల్ ఆ తర్వాత జగన్ తో కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి.అప్పటి నుంచి జగన్, షర్మిలకు క్రమక్రమంగా గ్యాప్ పెరుగుతూ వచ్చి ఏకంగా అన్నపైనే షర్మిల తిరుగుబాటు చేసే స్థితికి వచ్చింది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణంగా ఉన్న షర్మిల ఇప్పుడు జగన్ వైపు దూసుకొస్తున్న బాణంలా షర్మిల మారిందనే ప్రచారం జరుగుతుంది.

వైఎస్ కుటుంబానికి చెందని కొందరు సన్నిహితులు చెప్పే ప్రకారం ఇప్పుడు జరుగుతున్నది ఆస్తుల వివాదం కాదని అంతకు మించి ఏదో ఉందనేది వారి అనమానం. అందుకే షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, విజయమ్ ఇలా అందరూ ఒకే తాటిపైకి వచ్చారన్నది వారి ఆలోచన. అందులో ఒకటి వైఎస్ కుటుంబంలో భారతి ప్రాధాన్యత పెరగడం ఒకటి కాగా రెండోది తాము ఏదైనా చేద్దామని అనుకున్నా జగన్ దానిని తిరస్కరించడంతో ఈ ముగ్గురిలో తీవ్ర అసహనం పెరిగిపోయింది. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చినా షర్మిలకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు, పదవి కూడా జగన్ ఇవ్వలేదు. దీంతో జగన్ మోహన్ రెడ్డి తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫీలింగ్ లో షర్మిల ఉండేది. అంతవరకూ వైసీపీ పార్టీకీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను కూడా జగన్ ఆ పదవి నుంచి తప్పించారు. ఇది షర్మిలకు కూడా రుచించలేదు. దీంతో జగన్ తీరుపై ఈ ముగ్గురు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు ఇదే సమమంలో  ఆర్థిక వ్యవహారాల్లో భారతి ప్రమేమం ఎక్కువైంది. ఇదే జగన్ కు ఆ ముగ్గురికి మధ్య గ్యాప్ రావడానికి కారణంమైందని లోటస్ పాండ్ వర్గాల ప్రచారం.

అధికారంలోకి వచ్చేంత వరకు తమను వాడుకున్న జగన్ సీఎంకాగానే పూర్తిగా తమను సైడ్ చేశారని వారి ముగ్గురి భావన. సొంత మనుషులమైన తమను కాకుండా ఎవరెవరికో జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ ముగ్గురు రగిలిపోయారు. ఇదే జగన్ నుంచి ఆ ముగ్గురు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని టాక్. విజయమ్మ కొంత కలగ జేసుకొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని , విజయమ్మ కూడా జగన్ తీరుతో నొచ్చుకొని షర్మిలతోనే ఉంటున్నారని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు.ఐతే జగన్ అభిమానుల వాదన మరోలా ఉంది. విజయమ్మ,షర్మిల,బ్రదర్ అనిల్ కుమార్ ల తీరును తీవ్రంగా తప్పబడుతున్నారు. కుటుంబ తగాదాలను బజార్లోకి ఎందుకు ఈడుస్తున్నారని మండిపడుతున్నారు. వీళ్ల ముగ్గురి తీరు చూస్తుంటే ఆస్తుల వివాదం కన్నా జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ధోరణి వీరిలో కనపడుతుందని అంటున్నారు.ఇలాంటి కుట్రలను గమనించే జగన్ వీరిని పక్కన పెట్టారనేది జగన్ అభిమానులు, వైసీపీ వర్గాల టాక్.  

ఇలా జగన్ షర్మిల ఆస్తుల వివాదంలో రోజుకొకి కొత్త విషయం బయటపడుతుంది.అసలు జగన్, షర్మిల మధ్య ఏం జరుగుతుంది..? షర్మల కోరుకుంటుంది ఏంటి..? జగన్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది ఏంటి అనేది మాత్రం వారిద్దరికి మాత్రమే తెలియాలి. ఈ ఆస్తుల వివాదంలో  మున్ముందు ఇంకా ఎన్ని సంచలనాలు బయటపడుతాయో అన్నది మాత్రం వేచి చూడాలి

Also Read: Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు చెక్కు అందజేత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News