Vemulawada Temple: కార్తీక మాసంలో వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేకమైన పూజల టైమింగ్స్‌ ఇవే..

Vemulawada Temple Timings: కార్తీక మాసం వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ సంర్భంగా ఆలయానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అధికారులు పలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆలయ అధికారులు వెల్లడించారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 1, 2024, 04:44 PM IST
Vemulawada Temple: కార్తీక మాసంలో వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేకమైన పూజల టైమింగ్స్‌ ఇవే..

 

Vemulawada Temple Timings: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసంకు ముస్తాబయింది.  2వ తేదీ శనివారం నుంచి  వచ్చే నెల 1వ తేది ఆదివారం వరకు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్తీక మాసంలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో స్వామి వారికి చేసే కార్యక్రమాల పట్టికను కూడా అధికారులు విడుదల చేశారు.  

ప్రతి సోమవారం శ్రీ  రాజరాజేశ్వర స్వామికి, అనుబంద పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు, అభిషేకములు, మహాలింగార్చనలను జరపబోతున్నట్లు తెలిపారు. అలాగే ఏకాదశి పౌర్ణమి రోజులలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను రెండు సార్లు నిర్వహించబోతున్నట్లు అధికారులు తెలిపారు. 13వ తేది  బుధవారం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఉదయం 6.30 నిమిషాలకు శ్రీరుక్మిణి, విఠలేశ్వరస్వామివారికి పంచోపనిష ద్వారా అభిషేకాన్ని జరపబోతున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. దీంతో పాటు సాయంత్రం 6:35 గంటల నుంచి శ్రీకృష్ణతులసీ కళ్యాణము నిర్వహించబోతున్నట్లు కూడా వెల్లడించింది. 

14వ తేది గురువారం కార్తీకశుద్ధ త్రయోదశి ఉపరి చతుర్దశి రోజున వైకుంఠ చతుర్దశి సందర్భంగా శ్రీఅనంతపద్మనాభ స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం జరుగుతున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి ప్రధాన పరివార శివాలయములలో అన్నపూజలను కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. సాయంత్రం 6.00 నిమిషాల నుంచి శ్రీ అనంతపద్మనాభ స్వామి వారికి అభిషేకంతో పాటు శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మహాపుజ, పొన్నచెట్టుసేవ ఊరేగింపు జరపబోతున్నట్లు కమిటీ తెలిపింది. 

ఇక 15వ శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున ప్రదోషకాల పూజ అనంతరం.. రాత్రి 7.30 నిమిషాలకు జ్వాలా తోరణము పూజతో పాటు రాత్రి నిశీపూజను జరపబోతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.  అనంతరం రాత్రి గం.10.15 నిమిషాల నుంచి శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి మహాపూజ నిర్వహించనున్నారు. కార్తిక మాసం సందర్భంగా నెలరోజులపాటు ఉదయం 7.00 నిమిషాలకు శ్రీస్వామివారి కళ్యాణ మండపములో కార్తీక పురాణ ప్రవచనాలను నిర్వహించనున్నారు.

Also Read: 200Mp Drone Camera Phone: యాపిల్, సాంసంగ్ ఇక షెడ్డుకే.. 2025 విడుదలయ్యే vivo 200MP కెమెరా మొబైల్ చూస్తే ఆశ్చర్యపోతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News