ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు లోపించాయని.. నేనే హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి.. అవసరమైతే నేనే హోంమంత్రి అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు చేసి కొన్ని గంటలు గడవకముదే పోలీస్ వ్యవస్థలో తీవ్ర లోపం కనిపించింది. జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. పవన్ పర్యటనలో భద్రతా వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపించింది. దీంతో జనసేన పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: AP House: ఏపీ ప్రజలకు చంద్రబాబు భారీ శుభవార్త.. వచ్చే నెలలో లక్ష ఇళ్లు పంపిణీ
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం మంగళవారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. సరస్వతి ప్లాంట్ భూములను పరిశీలనకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు భద్రత నామమాత్రంగా ఉంది. అతడి కాన్వాయ్ చుట్టూ పోలీసులు కనిపించలేదు. ఒక సాధారణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు కల్పించనట్లు భద్రత కల్పించడం స్థానికంగా కలకలం రేపింది.
Also Read: YSRCP: చంద్రబాబు అక్రమ కేసులు పెట్టినా బెదరకండి.. ధైర్యంగా ఉండండి
ఇక సౌకర్యాలు కల్పించడంలో అధికారులు కూడా పూర్తిగా విఫలమవడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కారుపైన కూర్చొని మాట్లాడారు. సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన టెంట్లు కూలిపోయాయి. మీడియా గ్యాలరీ ఏర్పాటు చేయకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. సినీ నటుడిగా.. రాజకీయ నాయకుడిగా పనన్ కల్యాణ్‌కు వేలాది మంది అభిమానులు ఉన్నారు. అధికారంలోకి వచ్చాక పవన్‌కు మరింత అభిమానులు పెరిగారు.
ఎక్కడికి వెళ్లినా పవన్ కల్యాణ్ చుట్టూ వేలాది మంది చుట్టుముడుతారు. అలాంటి పవన్ కల్యాణ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉండగా పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహించింది. వేల సంఖ్యలో అభిమానులు.. కొద్ది సంఖ్యలో మాత్రం పోలీసులు ఉండడం అందరినీ విస్మయానికి గురి చేసింది. మాచవరంలో భద్రతా వైఫల్యం తలెత్తడంతో పవన్ అభిమానులు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు తోసుసుకుంటూ తొక్కిసలాట జరిగింది. అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించిన విషయాన్ని గ్రహించిన పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఇలా జరిగిందా? లేదా పొరపాటున ఇలా జరిగిందా? అనేది చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.