Healthy Best Upma Recipe: ఈ ఉప్మా రోజు తింటే.. జీవితంలో హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు!

Healthy Best Upma Recipe: కొర్రలతో తయారుచేసిన ఉప్మాను రోజు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి రోజు తింటే దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి.  అంతేకాకుండా పోషకాల లోపం కూడా తగ్గుతుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 10, 2024, 12:52 PM IST
Healthy Best Upma Recipe: ఈ ఉప్మా రోజు తింటే.. జీవితంలో హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు!

Healthy Best Upma Recipe: ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఎక్కువగా తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. అంతేకాకుండా కొత్త జీవనశైలికి దూరంగా ఉండేందుకు తగు మార్గాలు వెతుకుతున్నారు. అయితే ఆహారంపై శ్రద్ధ వహించడం కీలకమైనప్పటికీ.. కొంతమంది ఎంత పరిమాణంలో.. ఏయే ఆహారాలు తీసుకోవాలో తెలియక వాటి వల్ల కూడా దుష్ప్రభావాల బారిన పడుతున్నారు. మరి కొంతమంది అయితే చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి రోజు అల్పాహారంలో భాగంగా మిల్లెట్స్ తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల విశేషమైన లాభాలు పొందుతారు. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరానికి అద్భుతమైన శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా కుర్రాళ్ళతో తయారుచేసిన ఉప్మాను అల్పాహారంలో తీసుకుంటే అద్భుతమైన లాభాలు పొందుతారు అయితే ఈ ఉప్మా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

కావలసిన పదార్థాలు:
1 కప్పు కొర్రలు (ముందుగా నానబెట్టినవి)
1 ఉల్లిపాయ (తరిగిన)
1 టమాట (తరిగిన)
2-3 పచ్చిమిరపకాయలు (తరిగినవి)
కరివేపాకు
అల్లం తరుగు
1 క్యారెట్ (తరిగినది)
1/4 కప్పు పచ్చి బఠాణీలు
1 టేబుల్ స్పూన్ బీన్స్ (తరిగినవి)
1/2 టీస్పూన్ పసుపు
ఉప్పు రుచికి
2 1/2 కప్పుల నీరు
పోపు కోసం: నూనె, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొబ్బరి తురుము, కొత్తిమీర

తయారీ విధానం: 
ముందుగా ఈ ఉపమాన తయారు చేసుకోవడానికి కొర్రలను ఒకరోజు ముందు రాత్రి పూట నానబెట్టుకోవాల్సి ఉంటుంది. బాగా కడుక్కొని వాటిని నానబెట్టుకోండి. 
ఆ తర్వాత ఒక పాత్రలో నూనె వేడిచేసి అందులో ఆవాలు, వేరుశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవలసి ఉంటుంది. 
ఇలా అన్ని బాగా వేగిన తర్వాత అల్లం తరుగు, కొత్తిమీర వేసుకొని వాటిని మరికొద్దిసేపు సన్నం మంటపై వేయించుకోండి. 
ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు టమాటో క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీలు వేసుకొని మరికొద్ది సేపు లో ఫ్లేమ్ లో వేయించుకోండి. 
అన్ని వేగిన తర్వాత అందులో కొర్రలకు సరిపడా నీటిని పోసుకొని మూత పెట్టుకొని పెసర వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవలసి ఉంటుంది. ఇలా ఉడికే సమయంలోనే తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. 
బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టిన కొర్రలు వేసుకొని అవి మెత్త పడేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని దింపుకోండి. 
ఇలా తయారు చేసుకున్న కొర్రల ఉప్మాను పల్లి చట్నీతో లేదా పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

చిట్కాలు: 
కొర్రలు పోషక విలువలు పెరగాలంటే తప్పకుండా ఎక్కువ సేపు వాటిని నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉప్మా పోషక విలువలు మరింత పెరగడానికి ఇందులో ఎక్కువ మోతాదులో పోషకాలు లభించే కూరగాయలు కూడా వినియోగించవచ్చు. 
ఉప్మా మరింత రుచిగా ఉండడానికి కొర్రలను నానబెట్టుకునే క్రమంలో వేయించుకుని చల్లారిన తర్వాత నానబెట్టుకుంటే మంచిది.

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News