/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Pension New Rules: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెన్షనర్ల సీనియారిటీ అంటే వయస్సు ఆధారంగా అదనపు పెన్షన్ లభించనుంది. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 80 ఏళ్లు వచ్చినవారికి ఇకపై అదనపు పెన్షన్ లభిస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 

కేంద్ర ప్రభుత్వం 80 ఏళ్లు దాటిన పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందిస్తోంది. వయస్సు 80 దాటినవారికి అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్‌లో చేసి రిటైర్ అయిన ఉద్యోగులు 80 ఏళ్ల వయస్సుకు చేరితే సీసీఎస్ 2021 ప్రకారం అడిషనల్ పెన్షన్ లభిస్తుంది. ఏ వయస్సుకు ఎంత అదనపు పెన్షన్ అనేది తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చెక్ చేద్దాం.

80-85 ఏళ్ల మధ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లకు బెసిక్ పెన్షన్‌లో 20 శాతం లభిస్తుంది. అదే 85-90 ఏళ్ల వయస్సులో ఉన్నవారికి 30 శాతం అదనపు పెన్షన్ అందుతుంది. ఇక 90-95 ఏళ్ల వయస్సులో ఉన్నవారికి 40 శాతం అదనపు పెన్షన్ వర్తిస్తుంది. 95-100 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి 50 శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది. ఇక 100 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్లకు ఏకంగా 100 శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది. 1942 ఆగస్టు 20 పుట్టినవాళ్లు బేసిక్ శాలరీలో 20 శాతం అదనపు పెన్షన్ పొందేందుకు అర్హులు. అదనంగా లభించే ఈ పెన్షన్ ద్వారా సూపర్ సీనియర్లకు చాలా ప్రయోజనం కలగనుంది. 

Also read: Cyber Security: ఈ ఆరు పదాలు పొరపాటున కూడా గూగుల్ సెర్చ్ చేయొద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Central government good news to senior citizen pensioners will get additional pension check these rules and age wise pensions rh
News Source: 
Home Title: 

Pension New Rules: కేంద్రం గుడ్ న్యూస్, సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు అదనపు పెన్షన్

Pension New Rules: కేంద్రం గుడ్ న్యూస్, సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు అదనపు పెన్షన్, ఎవరికెంతంటే
Caption: 
Pension Rules ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Pension New Rules: కేంద్రం గుడ్ న్యూస్, సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు అదనపు పెన్షన్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, November 12, 2024 - 12:32
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
82
Is Breaking News: 
No
Word Count: 
215