Gaddar: విప్లవ కవి గద్దర్ నటించిన చివరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’.. ఈ నెల 29న విడుదల..

Gaddar: దివంగత విప్లవ కవి గద్దర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఈయన పలు చిత్రాల్లో నటించారు. ఈ యేడాది కన్నుమూసిన గద్దర్ చిరవగా ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమాలో నటించారు. సత్యారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 15, 2024, 01:35 PM IST
Gaddar: విప్లవ కవి గద్దర్ నటించిన చివరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’..  ఈ నెల 29న విడుదల..

Gaddar:విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాతగా  సత్యారెడ్డి  హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఈ సినిమాలో  ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్  చివరి సారిగా నటించారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో నటించారు. కొన్ని సన్నివేశాల్లో యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన పాటలు అందించారు. ఇప్పుడు ఈ సినిమాని ఈ నెల 29న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత, హీరో సత్యారెడ్డి మాట్లాడుతు..  విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నది విశాఖ స్టీల్. ఈ ఉక్కు సత్యాగ్రహం  ప్రైవేటీకరణ జరగకుండా, ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ అన్న నటించిన ఆఖరి చిత్రం గా ఉక్కు సత్యాగ్రహం సినిమా తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో  విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని అన్ని కార్మిక సంఘాలు, సంఘ నాయకులు, భూ నిర్వాసితులు యాక్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ చిత్రాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించామని సెన్సార్ లేట్ అయింది. మధ్యలో  గద్దర్ మరణం వలన ఈ చిత్రం కొన్ని రోజులు ఆలస్యమైంది.

కానీ ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని 300కు పైగా థియేటర్లలో ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నాము. ఈ కాలంలో విప్లవానికి సంబంధించిన సినిమాలు తీయడం చాలా కష్టం. సెన్సార్ ఆపేస్తారు సినిమాని విడుదల కాకుండా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆగకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా విజయాన్ని సాధించిన కారణంగా ఈ సినిమాని ఈ నెల 29న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

విప్లవ గీతాలతో లక్షలాది మందిని విప్లవం వైపు నడిపించిన విప్లవ కవి గద్దర్ యాక్ట్ చేసిన చివరి చిత్రం. ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను చిత్రంలో  చూపిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు అపుడు ఏం జరిగింది..? అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ను మద్రాస్ లో పెట్టాలి అని ఇందిరాగాంధీ  అనుకున్నప్పుడు ఏం జరిగింది? అనేది చాలా చక్కగా ఈ కథను గద్దర్ గారే రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు రాసి కొన్ని కీలక సీన్స్ లో నటించారు. తన వారసులు ఎలా ఉండాలి ఉద్యమాలు ఎలా నిర్మించాలి అనేది కూడా ఆయన చనిపోయే ముందు రాసుకున్న లాస్ట్  పాట. ఉద్యమకారులు, గద్దర్ ఫ్యాన్స్.. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని కోరారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News