అనురాగ్ ఠాకూర్ ... రా.. దమ్ముంటే... నన్ను కాల్చు

పౌరసత్వ నిరసన చట్టం-2019పై దేశవ్యాప్తంగా జనాగ్రహం వ్యక్తమవుతోంది. దీన్ని  ఎదుర్కునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఐతే  CAAపై నిరసనలను కౌంటర్ చేసే క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నోరు జారారు.

Last Updated : Jan 29, 2020, 09:27 AM IST
అనురాగ్ ఠాకూర్ ... రా.. దమ్ముంటే... నన్ను కాల్చు

పౌరసత్వ నిరసన చట్టం-2019పై దేశవ్యాప్తంగా జనాగ్రహం వ్యక్తమవుతోంది. దీన్ని  ఎదుర్కునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఐతే  CAAపై నిరసనలను కౌంటర్ చేసే క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నోరు జారారు.  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని దేశ ద్రోహులుగా అభివర్ణించారు. అంతే కాదు ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన  ..  అలాంటి దేశద్రోహులను వరుసగా నిలబెట్టి కాల్చిపారేయాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది.

మరోవైపు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై  AIMIM MP అసదుద్దీన్ ఒవైసీ  విరుచుకుపడ్డారు. అనురాగ్ ఠాకూర్ .. రా దమ్ముంటే నన్ను కాల్చు అంటూ సవాల్ విసిరారు. దేశంలో ఏ స్థలానికి రమ్మంటే ఆ స్థలానికి వస్తానన్నారు. అనురాగ్ ఠాకూర్ చేసిన ఇలాంటి ప్రకటనలకు భయపడేది లేదన్నారు. అంతే కాదు దేశాన్ని రక్షించేందుకు చాలా మంది రోడ్లమీదకు వచ్చారంటూ తెలిపారు.

మరోవైపు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై  ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కోరింది. ఆయనకు జనవరి 30 మధ్యాహ్నం 12 గంటల వరకు ఎన్నికల సంఘం సమయం ఇచ్చింది.  

Trending News