Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలే వరుస షాక్ లు ఇస్తున్నారు. ఏడాది పాలన సంబరాలకు రేవంత్ సర్కార్ రెడీ అవుతుండగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరు అవ్వడం కలకలం సంచలనం రేపుతోంది. హన్మకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రజాపాలన విజయోత్సవ సభ మాధవరెడ్డి నివాసానికి దగ్గరలోనే జరిగింది. గత కొంతకాలంగా పార్టీ నేతలు నగరానికి వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉంటున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలకు దొంతి దూరంగా ఉన్నారు.
అసలు దొంతి మాధవ రెడ్డి.. పార్టీ కార్యాక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి తాను చెప్పిన పనులు చేయకపోవడం వలన.. ఇలా చేస్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు దొంతి మాధవరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం దక్కలేదనేది ఆయన సన్నిహితులు వద్ద చెప్పుకొని బాధపడుతున్నాడట. ఏదైనా కార్పోరేషన్ పదవి దక్కకపోతుందా అనే ఆశా ఉన్నా.. ఇప్పటికే రెడ్లకు మంతి వర్గంలో మెజారిటీ స్థానాలు కట్టబెట్టారు. అసలు బీసీలకు ఏదో ఒకటి రెండు తప్పా.. పెద్దగా ఇచ్చిందేమి లేదు.
ఒక వేళ దొంతికి ఏదైనా పదవి ఇద్దామన్నా.. రెడ్డి కార్డు అడ్డం పడుతోంది. అన్ని కార్పోరేషన్, చైర్మన్ పదవులు రెడ్డిలకు ఇస్తే మొదటికే మోసం వస్తుందనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా దొంతి మొదలైన పార్టీ అసంతృప్తులను చల్లార్చే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. అందుకోసం వేం నరేందర్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ లను రేవంత్ రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. మరి పార్టీలో అసంతృప్తులను ఏ మేరకు చల్లారుతాయనేది చూడాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter