Heavy Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రస్తుతం ట్రింకోమాల్‌కు 380 కిలోమీటర్లు, నాగపట్నానికి 650 కిలోమీటర్లు, చెన్నైకు 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై తమిళనాడు మీదుగా శ్రీలంకవైపుకు కదులుతోంది. ఫలితంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ప్రభుత్వాల్ని ఐఎండీ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ్టి నుంచి వర్షాలు మొదలై రేపట్నించి భారీ వర్షాలు పడనున్నాయి.
వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలైనా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక గుంటూరు, కృష్ణ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక దక్షిణ కోస్తా తీరప్రాంతంలో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.
వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా పంటకోతల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also read: New Ration Cards: ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు, ఇలా అప్లై చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.