SRH Kavya Maran: సౌదీ అరేబియా జెద్దా వేదికగా రెండ్రోజులు జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిపి 639.15 కోట్ల ఖర్చుతో 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా 120 మంది స్వదేశీ ఆటగాళ్లున్నారు. 15 మందిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కప్ తమదే అంటోంది.
ఐపీఎల్ 2025 మెగా వేలం తరువాత అన్ని ఫ్రాంచైజీల జట్లు సిద్ధమయ్యాయి. ఈసారి వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అవసరమనుకుంటే దూకుడుగా ఉండి కాదన్నచోట వదిలేశారు. పక్కా ప్రణాళికతో జట్టును సిద్ధం చేసింది కావ్య పాప. కేవల 45 కోట్లతో వేలం బరిలో దిగిన కావ్య పాప 15 మందిని కొనుగోలు చేసి ఇంకా 20 లక్షలు మిగుల్చుకుంది. పటిష్టమైన ఆటగాళ్లను కూడా సొంతం చేసుకుంది. ఇషాన్ కిషన్ 11.25 కోట్లు, మొహమ్మద్ షమి 10 కోట్లు, హర్షల్ పటేల్ 8 కోట్లు, ఆడమ్ జంపా 2.40 కోట్లు, జయదేవ్ ఉనద్కత్ 1 కోటి రూపాయలు, ఇషాన్ మలింగ 1.20 కోట్లకు సొంతం చేసుకుంది.
ఇక దేశీయ ఆటగాళ్లు అభినవ్ మనోహర్ 3.20 కోట్లు, సిమర్ జీత్ సింగ్ 1.50 కోట్లు, జీషాన్ అన్సారీ 40 లక్షలు, సచిన్ బేబి 30 లక్షలు, అనికేత్ వర్మ 30 లక్షలు, అథర్వ తైడే 30 లక్షలకు కొనుగోలు చేసింది. వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు కాకుండా ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసెన్ 23 కోట్లు, పాట్ కమిన్స్ 18 కోట్లు, అభిషేక్ శర్మ 14 కోట్లు, ట్రావిస్ హెడ్ 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డి 6 కోట్లు ఉన్నారు.
బ్యాటర్లలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్‌లతో పటిష్టంగా కన్పిస్తుంటే బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ షమి, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలకు తోడు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మొత్తానికి ప్రతీసారి బౌలింగ్ లైనప్ కాస్త బలహీనంగా కన్పించే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి పటిష్టంగా మారింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండూ ఈసారి పటిష్టంగా కన్పిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కూర్పు వెనుక కావ్య మారన్ స్ట్రాటజీ వర్కవుట్ అయినట్టే కన్పిస్తోంది. అందుకే గతంలో చివరిలో చేజారిన కప్ ఈసారి తమదే అంటోంది ఎస్ఆర్హెచ్.
Also read: Kavya Maran: ఆస్తిపాస్తుల్లో అంబానీలకు పోటీగా కావ్య మారన్.. ఆమె ఆస్తుల చిట్టా ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.