Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై రెండు వారాలు కావస్తున్నా సీఎం పీఠంపై చిక్కుముడి వీడలేదు. ముఖ్యమంత్రి కుర్చీ దిగేందుకు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిరాకరించడంతో చిక్కుముడి నెలకొంది. ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాతోనే షిండేను మొత్తానికి బీజేపీ ఒప్పించగలిగింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడ్డాయి. మహాయుతి కూటమిలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ, బీజేపీ కలిసి కట్టుగా పోటీ చేసిన భారీ విజయం సాధించాయి. అత్యధిక సీట్లు సాధించిన పార్టీ కావడంతో సహజంగానే బీజేపీ సీఎం సీటు ఆశించింది. కానీ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే ఒప్పుకోకపోవడంతో ప్రతిష్ఠంభన కొనసాగింది. రాష్ట్రంలో మహాయుతి అధికారంలో రావడానికి తానే కారణమని, తనకే ముఖ్యమంత్రి పదవి దక్కాలని పట్టుబట్టారు. బీజేపీ ఇందుకు ఏమాత్రం అంగీకరించలేదు. సీఎం పీఠం తమకే దక్కాలని గట్టిగా వాదించింది. షిండేను రాజీ చేసేందుకు బీజేపీ సీనియన్ నేతలు విజయ్ రూపాణీ, నిర్మలా సీతారామన్ పరిశీలకులుగా మహారాష్ట్ర చేరుకున్నారు.
సీఎం పదవి వదులుకునేందుకు ఇష్టం లేని షిండేను ఒప్పించగలిగారు. ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీల ఫార్ములాకే షిండేను రాజీ చేశారు. దాంతో ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ మంత్రులుగా మరి కొందరు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పెద్దలు , కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.