IMD Rains Alert in Telugu: ఫెంగల్ తుపాను నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. తుపాను ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాంద్ర, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలో వారం రోజులు భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇప్పుడు మరోసారి అల్పపీడం ఏర్పడటంతో రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించిన ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ 12 నాటికి వాయుగుండంగా బలపడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండంగా బలపడే సమయానికి శ్రీలంక-తమిళనాడు తీరానికి చేరవచ్చని తెలుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, యానాంలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీయనున్నాయి.
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా కన్పిస్తోంది. ఇవాళ పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, ఎన్టీఆర్ , ప్రకాశం, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడవచ్చు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో సైతం వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత
తెలంగాణలో దిగువ నుంచి వీస్తున్న గాలులు, దక్షిణ, నైరుతి దిశగా వీస్తున్న గాలుల కారణంగా కనిష్ట ఉష్ణోగ్రత మారనుంది. ముఖ్యంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తలి తీవ్రత పెరగవచ్చు.
Also read: Babri Masjid Issue: బాబ్రీ మసీదు అడుగున ఏ రామమందిరం లేదు, జస్టిస్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి