రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రత్యర్థి పార్టీలతో ఇబ్బందులు పక్కనపెడితే.. సొంత పార్టీలోనే లుకలుకలు మొదలవుతాయి. తమ అభిమాన నేతలకు సీటు రాలేదని ఓ వర్గం, మాకు సీటు ఇస్తే కచ్చితంగా గెలుస్తామని వాదించడం చూస్తూనే ఉంటాం. సొంత పార్టీ నేతలు, స్థానికులు దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహిస్తారు. ఇటీవల తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలు కొన్ని జిల్లాల్లో ఉద్రిక్తలకు దారితీశాయి. ఫిబ్రవరి 15న ఈ ఎన్నికలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణుల్లో పార్టీ నేతల్లోనే పోటీ ఏర్పడింది.
Also Read: ఇంత హాట్‌గానా.. నటి టాప్‌లెస్ ఫొటోకు ఫ్యాన్స్ షాక్!
TRS ఎమ్మెల్యే శవ యాత్ర
నందిపేట: చింరాజ్ పల్లి సహకార సంఘం చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా సాగింది స్థానిక అభ్యర్థి మోహన్ రావుకు దక్కుతుంది అనుకున్న చైర్మన్ పదవి తల్వేద గ్రామానికి చెందిన గంగ రెడ్డికి రావడంతో స్థానికులు ఆందోళన చేస్తే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బొమ్మతో శవయాత్ర నిర్వహించారు. pic.twitter.com/9k6IsGoMMA
— Pulse of Telangana (@PTelangana) February 18, 2020
నిజామాబాద్ జిల్లా చీమరాజపల్లి సహకార సంఘం చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా సాగింది. అయితే లక్కంపల్లికి చెందిన స్థానిక అభ్యర్థి మోహన్ రావుకు చీమరాజపల్లి సహకార సంఘం చైర్మన్ పదవి దక్కుతుందని భావించారు. కానీ తల్వేద గ్రామానికి చెందిన గంగ రెడ్డికి ఆ పదవి దక్కడంతో నందిపేట స్థానికులు ఆందోళనకు దిగారు. జీవన్ రెడ్డి కావాలనే గంగారెడ్డిని చైర్మన్ చేశారని ఆరోపించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఆయన బొమ్మతో శవయాత్ర నిర్వహించారు. పోలీసులు ఆ శవయాత్రను అడ్డుకోలేకపోయారు. ఎమ్మెల్యేను తమ గ్రామంలో అడుగుపెట్టనిచ్చేది లేదని లక్కంపల్లి వాసులు చెబుతున్నారు.
Also Read: బికినీలో బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్