Anirudh Reddy: పాలమూరు జిల్లాలో డీసీసీ పోస్టు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. కొద్దిరోజులుగా డీసీసీ పోస్టుపై టీపీసీసీ కసరత్తు చేస్తున్నా.. ఏటు తేల్చుకోలేకపోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జీ. మధుసూధన్ రెడ్డి రెండేళ్ల పదవికాలం ఇటీవలే ముగిసింది. ఆయన కూడా దేవరకద్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో పాలమూరుకు కొత్త డీసీసీని తీసుకురావాలని పార్టీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారట. అయితే ఇప్పుడు ఈ పోస్టు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని మాత్రం తేల్చుకోలేకపోతున్నారని సమచారం.. చివరకు ఈ పోస్టును భర్తీ చేసుకునే బాధ్యతను జిల్లా నేతలకే అప్పగించినట్టు తెలుస్తోంది..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని చూపించింది. మొత్తం 14 సీట్లు ఉండగా 12 చోట్ల విజయం సాధించింది. ఇందులో మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. మొన్నటివరకు జిల్లా అధ్యక్ష పదవిని తన అనుచరుడికే దక్కించుకునేందుకు ఎమ్మెల్యే జీ. మధుసూధన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. తమకు ఓ చాన్స్ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతూ వస్తున్నారు. ఇద్దరి మధ్యనే తీవ్ర పోటీ ఉండగా.. ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికూడా అనూహ్యంగా రేసులోకి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఒక్కసారి కూడా జడ్చర్ల నేతకు అవకాశం దక్కలేదు. ఈసారి తమకే చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది.
ప్రస్తుతం పాలమూరు డీసీసీ రేసులో ఆరుగురు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోదరుడు వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేష్, ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్, మరోనేత అరవింద్ రెడ్డి, అటు మైనారిటీ వర్గానికి చెందిన జహీర్ అక్తర్, సిరాజ్ ఖాద్రీ, రబ్బానీలు పోటీ పడుతున్నారట. అయితే సంపత్ కుమార్ తన సోదరుడికి డీసీసీ పీఠం దక్కించుకునేందుకు లాబీయింగ్ షురూ చేశారట. మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈసారి తన అనుచరుడు రబ్బానీకి ఒక్క చాన్స్ అంటున్నారట. అటు ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్ కూడా రేసులో ముందున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా డీసీపీ నుంచి ఆరడజను మంది నేతలు పోటీ పడుతుండటంతో.. పార్టీ హైకమాండ్ ఎటు తేల్చుకోలేక పోతున్నట్టు తెలుస్తోంది. డీసీసీ పదవి విషయంలో నేతల నుంచి అసంతృప్తు జ్వాలలు ఎగిసిపడకుండా బంతిని ఎమ్మెల్యేల కోర్టులోనే వదిలేసినట్టు తెలుస్తోంది.. అందుకే ఈ అంశాన్ని జిల్లా ఎమ్మెల్యేలకే వదిలేసినట్టు గాంధీ భవన్‌లో ప్రచారం జరుగుతోంది. చూడాలిమరి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో డీసీసీ పీఠంపై కూర్చునే నేతలేవరో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు..
Also Read: BRS Politics: గులాబీ పార్టీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లో చేరేది వీళ్లే!
Also Read: Congress Politics: రేవంత్‌కు టెన్షన్.. కేబినెట్‌లో విస్తరణలో కొత్త ట్విస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.