Nabha Natesh: సుందర వల్లిగా నభా నటేష్ ను చూడతరమా.. నిఖిల్ ‘స్వయంభూ’లో ఇస్మార్ట్ పోరి కొత్త లుక్..

Nabha Natesh in Swayambhu: నిఖిల్ హీరోగా నటిస్తూన్న  మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సినిమా ‘స్వయంభూ’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. హీరోగా  నిఖిల్ 20వ సినిమాగా రాబోతుంది.  ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో సుందరవల్లిగా నభా నటేష్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 12, 2024, 02:35 AM IST
Nabha Natesh: సుందర వల్లిగా నభా నటేష్ ను చూడతరమా.. నిఖిల్ ‘స్వయంభూ’లో ఇస్మార్ట్ పోరి  కొత్త లుక్..

Nabha Natesh in Swayambhu: నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘స్వయంభూ’. హీరోగా 20వ చిత్రంగా ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ‘కార్తికేయ 2’ లో ప్యాన్ ఇండియా మార్కెట్ లో నిఖిల్ కు మంచి ఫేమ్ వచ్చింది. ఆ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిఖిల్ లెజండరీ వారియర్ గా కనిపించనున్నారు.  హై బడ్జెట్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ కాన్వాస్‌పై పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు.  నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా  నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలో నభా క్యారెక్టర్ ని సుందర వల్లిగా పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నభా నటేష్ న్యూ పోస్టర్‌ లో రాయల్ ట్రెడిషనల్ లుక్ లో బ్యూటీఫుల్ గా కనిపించారు. సుందర వల్లి పాత్రలో సాఫ్ట్ అండ్ ఛార్మింగ్ స్మైల్ తో ఆకట్టుకునేలా ఉంది నభా నటేష్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవమరిస్తున్నారు.నభా నటేష్ ఈ యేడాది ‘డార్లింగ్’ మూవీతో పలకరించింది. ఈ మూవీతో నభా ఆశలు నెరవేరలేదు. కానీ త్వరలో రాబోతున్న ‘స్వయంభూ’తో నభా నటేష్ కెరీర్ కొత్త పుంతలు తొక్కుతుందా అనేది చూడాలి. నభా నటేష్ తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా పెద్దగా ఉపయోగం లేదు. మరోవైపు మధ్యలో యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో అలరించడానికి రెడీ అవుతోంది.

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News