Vegetables Purchase Monkey Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోస్ చూసేందుకు చాలా మంది ఎంతో ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడితో బాధపడేవారు చాలా వరకు ఇలాంటి వీడియోస్‌నే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎప్పుడు ఇతర వీడియో కంటే ఫన్నీ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అయితే సోషల్ మీడియా ఆప్డేట్ అవ్వడంతో ఫన్నీ వీడియోస్‌తో మీమ్స్ కూడా వైరల్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం చాలా వరకు సోషల్ మీడియాలో జంతువులు చేసే వింత వింత ఫ్యాన్నీ మూమెంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎలుగుబంట్లు, సింహాలు, కోతులు చేసే వింత చేస్టాలు అందరికీ నవ్వు పుట్టించే విధంగా ఉంటున్నాయి. అయితే ఇటీవలే ఇలాంటి ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట ఫుల్ చక్కర్లు కోడుతోంది.
సాధరణంగా మనం ఊళ్లో చూసే కోతులు చెట్లపై ఉంటూ.. వాటికి ఉండే పండ్లు తింటూ కనిపిస్తాయి. కానీ ఎప్పుడైనా మార్కెట్‌కి వెళ్లే కోతిని చూశారా? ఇలాంటి దృష్యాలు చాలా అరుదుగా ఉంటాయి. వీడియో వివరాల్లోకి వెళితే.. ఆరేంజ్ కలర్ దుస్తువులు ధరించిన కోతీ ఏకంగా మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇలా వెళ్లిన కోతి నేరుగా ఓ కూరగాయల షాప్ దగ్గరికి వెళ్తుంది. అయితే కోతి తన చేతుల్లో ఉన్న డబ్బును తీసి కూరగాలు విక్రయించే అమ్మాయికి ఇస్తుంది. ఇలా ఇచ్చి కోతి తనకు కావాల్సిన కూరగాయలను చూపిస్తుంది. ఇంతలోనే ఆమె కూరగాలను ఓ కవర్‌లో ఫ్యాక్ చేసి.. మిగిలిన చిల్లర డబ్బులను, కూరగాలను కూడా కోతికి ఇస్తుంది. ఇలా వాటిని తీసుకుని కోతి తిరుగు ప్రయాణం అవుతుంది.
కోతులు చాలా అరుదుగా చెప్పిన పనులు చేస్తాయి. కానీ ఈ కోతి ఎంతో తెలివిగా కూరగాయలను కోనడం చూసి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఇలాంటి కోతులు చాలా అరుదుగా ఉంటాయని అంటున్నారు. నిజానికి ఈ కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను monkey_mov అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. అయితే ఈ వీడియోకి నెటిజన్స్ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమందైతే గ్రేట్ కోతి అని పొగుడుతున్నారు. మరికొంతమంది కోతులు ఇలా అరుదుగా పని చేస్తాయని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 326,407 నెటిజన్స్ లైక్ చేశారు. అంతేకాకుండా లక్షలాది మంది వీక్షించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook