Hyderabad Real Estate: కందుకూరు అనగానే చాలా మందికి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గుర్తుకువస్తుంది. కానీ హైదరాబాద్ శివారులోని ఓ కందుకూరు గ్రామం ఉంది. నిజానికి ఓ 20ఏళ్ల క్రితం ఇది హైదరాబాద్ శివారు కానే కాదు. ఈ గ్రామం గురించి ఎవరికీ తెలియదే. కానీ హైదరాబాద్ విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడయితే ప్రణాళికల్లోకి వచ్చిందో అప్పటి నుంచి మెల్లగా రియల్ ప్రపంచంలోకి వచ్చింది ఈ గ్రామం. ఇప్పుడు ఫోర్త్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఎవరూ కూడా ఊహించని డెవలప్ మెంట్ అక్కడ జరుగుతోంది.
అయితే ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత అక్కడి భూములకు రెక్కలు వచ్చాయి. కూగ్రామాలు కాస్త కాస్లీ గ్రామాలుగా మారాయి. హైదరాబాద్ నడిమధ్యలో ఉన్న స్థలాలకంటే శివారు ప్రాంతాల్లో ఉన్న భూములే అత్యధిక ధర పలుకుతున్నాయి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ప్రయాణం సులభంగా మారింది. ట్రాఫిక్ సమస్యలు తప్పాయి. ఐటీ ఉద్యోగులు..ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కితే గంటలో గచ్చిబౌలికి చేరుకుంటున్నారు. పెద్ద కాలేజీలు, పాఠశాలలు సైతం శివారు ప్రాంతాల్లోనే నెలకొల్పుతున్నారు. అంతేకాదు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరలు ఇక్కడ ఉండటంతో చాలా మంది అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు ఓఆర్ఆర్ కు ఆనుకుని భారీగా రియల్ వెంచర్లు వెలిశాయి. భూముల ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. తాజాగా మరోసారి ఫోర్త్ సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డు జంక్షన్ కూడా త్వరలోనే రాబోతోంది. దీంతో ఇక డెవలప్ మెంట్ కు తిరుగుండదని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు కందుకూరు ఎలా చూసినా కూడా హైదరాబాద్ కు దూరమే అయినప్పటికీ ప్రభుత్వం నిర్మాణం తలపెట్టిన ఫోర్త్ సిటీకి పునాదులు పడిన తర్వాత చాలా దగ్గర అవుతుంది. డిమాండ్ పెరిగే అవకాశాలు..ఇప్పటికీ అక్కడ ఎకరాల చొప్పున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనుగోలు చేస్తున్నారు. వాటిని వెంచర్లుగా మార్చేసి అమ్ముతున్నారు. స్థిరమైన పెట్టుబడికి కందుకూరు వద్ద ఓ చిన్న స్థలం కొనుగోలు చేసి మంచి రిటర్నులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
బంగారం అమ్ముతే కొనుగోలు చేయగలమేమో కానీ..భూమి పోతే భవిష్యత్తులో మళ్లీ కొనుగోలు చేయడం కష్టంగా మారుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే కాదు హైదరాబాద్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో సైతం భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. 20ఏళ్ల కిందట 20వేలకు ఎకరం భూమి ఇప్పుడు 20 లక్షలు పలుకుతోంది. భవిష్యత్తులో బంగారం కంటే భూములను కాపాడుకోవాల్సిన పరిస్థితి రాక తప్పదు.
Also Read: Viral Audio: అంబేద్కర్ వాయిస్ ఎలా ఉందో మీరే చూడండి.. అయితే ఇక్కడే ట్విస్ట్..అదేంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.