Sridhar Babu Hydra: శ్రీధర్ బాబు .. తండ్రి మాజీ స్పీకర్ శ్రీపాద రావు రాజకీయ వారసుడిగా తెలుగు రాష్ట్రాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. గత రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కీలక శాఖలు నిర్వహించారు. అంతేకాదు రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణలో ఏర్పడిన తర్వాత కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ నేపథ్యంలో జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందన్నారు. అందులో ఉన్న ఒకరిద్దరు అధికారులు అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచన చేస్తోంది. మూసీ సహా చెరువులపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తెలిగిస్తాము. అంతేకాదు మూసీ పరివాహాక ప్రాంతాల్లో ప్రజలకు పునరావాసం కల్పించాకే మూసీ ప్రక్షాళన మొదలు పెడతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
సామాన్య ప్రజానీకానికి, పేదవానికీ అన్యాయం జరగకూడదని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అధికారులు అలా చేస్తారా.. ? అన్నప్రశ్నకు అపుడుపుడు అధికారులు అత్యుత్సాహం వల్ల అలా చేస్తుంటారు. అధికారులు క్షేత్ర స్థాయిలో చేసే పనులన్నింటికీ ప్రభుత్వం తెలియకుండానే చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఫస్ట్ టైమ్ అధికారంలోకి వచ్చింది. అందులో మేనిఫేస్టో కమిటీ చైర్మన్ గా ఆరు గ్యారంటీలను మీరు తయారు చేసారు. ఈ యేడాది కాలంలో ఆరు గ్యారంటీల్లో ఎంత వరకు అమలు చేసారు. యువతీ యువకులకు గాని ఆ పేదవారికి గాని రైతు సోదరులకుఅందరిని దృష్టిలో ఉంచుకొని హామిలను రెడీ చేసాము. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సహా గృహ జ్యోతి పథకం కింద కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్తు. రైతు రుణ మాఫీతో పాటు.. మేము అధికారంలోకి పెండింగ్ లో ఉన్న వేల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
మేము ప్రస్తావించిన ఆరు గ్యారంటీలతో పాటు .. హామి ఇవ్వని వాటిని అమలు చేసే పనిలో పడ్డామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్.. అప్పుల కుప్పగా మార్చారు. దాన్ని సరిదిద్దడంతో పాటు సంక్షేమంతో పాటు అభివృద్దిపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అంతేకాదు తెలంగాణకు మళ్లీ మిగులు రాష్ట్రంగా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు.
ఇక పూర్తి ఇంటర్వ్యూ కోసం కింద ఉన్న యూట్యూబ్ లింక్ ను క్లిక్ చేయండి..
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.