Very Rare Red Cobra Video Viral Video Watch Now: కొన్ని పాములు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అయితే తరచుగా ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో రకాల వింత వింత పాములు ఉన్నాయి. కొంతమంది వీటిని పెంపుడు జంతువులు లాగా పెంచుకుంటున్నారు. నిజానికి ఇవి చాలా ప్రమాదరకరమైనవని తెలిసినప్పటికీ చాలా మంది పెంచుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏం ఉందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. బ్రౌన్ రంగులో కనిపిస్తున్న పాము పచ్చని గడ్డిలో పాకుతూ పోవడం కనిపిస్తుంది. ఇంతలోనే ఒక వ్యక్తి అలా వెళ్తున్న పామును వెనక నుంచి చెతులతో పట్టుకుంటాడు. ఇలా పట్టుకుని నేరుగా కెమెరా వైపు చూపిస్తాడు. అయితే ఇలా కెమెరా వైపు చూపించగానే పాము రెడ్ కలర్లో కనిపించడం మీరు చూడవచ్చు. అంతేకాకుండా ఈ పాము పట్టుకున్న వ్యక్తిని కాటేసేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఇలా చాలా సార్లు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి పాముకు దొరకుండా ఉంటాడు.
ఈ ఎరుపు రంగుతో కూడిన పాములు అన్ని చోట్లా కనిపించవని.. కేవలం కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. సాధరణంగా ఇవి చిత్తడి నెలలతో పాటు ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో నివసిస్తాయని సమాచారం. అయితే ఎరుపు రంగుతో కూడిన పామలు అంత విషపూరితమైనవి కాదని కొంతమంది అంటే.. మరికొంత మంది మాత్రం వీటిల్లో కూడా చాలా ప్రమాదకరమైన పాములు ఉంటాయని సమాచారం. అలాగే కొన్ని పాములు రక్షణ కోసం కూడా రంగులను మార్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబుల్లో వైరల్ అవుతోంది. దీనిని @CatchItbrothers అనే ఛానెల్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోకి బ్రైట్ రెడ్ స్నేక్ పామును పట్టుకున్నానని క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ బ్రైట్ రెడ్ కింగ్ కోబ్రా వీడియోను కొన్ని వేల మంది వీక్షించారు. అలాగే వందమందికి పైగా లైక్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంంలో కూడా వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.