Rains Alert: మొన్న ఫెంగల్ తుపాను, నిన్న అల్పపీడనం ప్రభావం తగ్గకముందే ఏపీకు మరో హెచ్చరిక జారీ అయింది. మరో నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా తుపానుగా మారే ప్రమాదం లేకపోలేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 13 గంటల్లో బలహీనపడనుంది. అల్పపీడనం ప్రభావంతో గత రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తిరుపతిలో కుంభవృష్టి కురిసింది. ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నష్టపోయాయి. ఇప్పుడు దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలున్నాయి. ఫలితంగా మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి.
ఈనెల 17 తరువాత చాలా ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇవి కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయని తెలుస్తోంది. ఈ నెల 17 రాత్రి నుంచి ఏపీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ అల్పపీడనం కాస్తా తుపానుగా మారే అవకాశాల్లేకపోలేదని అంచనా.
Also read: Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై అక్రమ కేసులు, అరెస్టు అక్రమం అంటూ వైఎస్ జగన్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.