Congress Matha: 'తెలంగాణ తల్లి ఉద్యమ ప్రతీక. సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ తల్లిలో బతుకమ్మ లేకపోతే తెలంగాణ సమాజం బాధపడుతోంది. తెలంగాణ అస్థిత్వాన్ని ఎవరూ దెబ్బకొట్టలేరు' అని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లికి 'కాంగ్రెస్ మాత'గా నామకరణం చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇన్నాళ్లు పూజించిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా ఆవిష్కరిస్తామని తెలిపారు.
బతుకమ్మ పండుగపై మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు.. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు వంటివి చేస్తుండడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అయాచితం శ్రీధర్ అధ్యక్షతన 'తెలంగాణ అస్తిత్వంపై దాడి' పేరిట జరిగిన సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సాంస్కృతిక, మహిళా, సామాజిక సంఘాలు, మేధావులు, ఉద్యమకారులు మాట్లాడిన అనంతరం ఆమె కొన్ని తీర్మానాలు చేశారు. 'బతుకమ్మ కేవలం అగ్రవర్ణాల పండుగ అని దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు తమ మాటలు వెనక్కి తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి' అని తీర్మానించారు.
Also Read: Allu Arjun: జైలులో ఉంచడం వెనుక కుట్ర? అల్లు అర్జున్ రాత్రి జైలులో ఏం చేశాడో తెలుసా?
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. 'తెలంగాణ తల్లి ఉద్యమ ప్రతీక. సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం' అని గుర్తుచేశారు. పిల్లలందరూ కలిసి ఉద్యమంలో తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. 'అన్ని పూలు కలిపి బతుకమ్మ పండుగను చేసుకుంటాం. తెలంగాణ తల్లిలో బతుకమ్మ లేకపోతే తెలంగాణ సమాజం
బాధపడుతోంది' అని ఆవేదన వ్యక్తం చేశారు. 'తెలంగాణ సంస్కృతి.. ఉనికిపై దాడి జరిగితే తెలంగాణ సమాజం మాట్లాడాలి' అని పిలుపునిచ్చారు.
'తెలంగాణ ఉద్యమంలో.. పునర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి లేరు. ఉద్యమం జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గన్ను ఎక్కుపెట్టారు. పునర్నిర్మాణంలో ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి కుట్ర చేశారు' అని రేవంత్ రెడ్డికి జాగృతి అధ్యక్షురాలు కవిత గుర్తుచేశారు. ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లిని రాష్ట్ర వ్యాప్తంగా నిలబెట్టాలని తీర్మానించినట్లు వెల్లడించారు. 'తెలంగాణ తల్లికి ఒక చేతిలో జొన్న కర్ర.. మరో చేతిలో బతుకమ్మ ఉండాలి' అని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter