Allu arjun Arrest controversy: అల్లు అర్జున్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హజరు పర్చారు . కోర్టు వారి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలో అల్లుఅర్జున్ ను నిన్న జరిగిన ఖర్చుల అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
తెలంగాణలో నిన్న(గురువారం) ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కిపడే ఘటన చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. ఒక వైపు పుష్ప2 మూవీ ఆరురోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
మరోవైపు ఈ మూవీకి చెందిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన మాత్రం పెనుదుమారంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే రేవతి చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు ప్రస్తుతం వెంటిలెటర్ మీద ఉన్నట్లు తెలుస్తొంది.
అయితే.. పోలీసులు అల్లు అర్జున్ మీద కేసును నమోదు చేశారు. ఆ తర్వాత..నిన్న ఆయన నివాసంకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హజరు పర్చి.. రిమాండ్ కు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు అల్లు తరపున లీగల్ టీమ్ రంగంలోకి దిగింది.
ముఖ్యంగా సీనియర్ లాయర్.. నిరంజన్ రెడ్డి హైకోర్టులో కీలక వాదనలు విన్పించినట్లు తెలుస్తొంది. గతంలో షారుఖ్ ఖాన్ సినిమా..రాయన్ విడుదల సమయంలో ఒక అభిమాని ఇలాగే.. మరణించాడని.. అప్పుడు.. గుజరాత్ కోర్టు సైతం.. షారుఖ్ కు క్లీన్ చీట్ ఇచ్చిందన గుర్తు చేశారు.
అయితే.. నిరంజన్ రెడ్డి, మిగత టీమ్ గట్టిగా పాయింట్స్ వాదించడం వల్ల అల్లు అర్జున్ కు బెయిల్ లభించిందని తెలుస్తొంది. అయితే.. నిన్న ఒక్కరోజు అల్లు అర్జున్ కు కోట్లలో ఖర్చులు జరిగినట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ తరపు హైకోర్టులో వాదించిన లాయర్.. గంటకు 5 లక్షలు తీసుకుంటారంట. ఈ విధంగా ఆయన భారీగా ఫీజును పుచ్చుకున్నట్లు తెలుస్తొంది.
మరోవైపు లీగల్ టీమ్ మిగతాలాయర్లు.. ఇలా అనేక ఖర్చులు కలిపి.. నిన్న ఒక్కరోజు దాదాపు.. 2 నుంచి 3 కోట్ల వరకు కూడా ఖర్చయినట్లు వార్తలు వస్తున్నాయి.మరొవైపు అల్లు అర్జున్ మాత్రం.. బాధిత కుటుంబానికి కేవలం 25 లక్షలు ప్రకటించి.. తాను మాత్రం కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుని, తన మీద కేసులకు అదే విధంగా కోట్లలో ఖర్చులు పెడుతున్నారని కొంత మంది ట్రోల్ చేస్తున్నారంట. బాధిత కుటుంబానికి సహాయంగా కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారంట.