Python Video: పెళ్లాం అనుకున్నాడా ఏకంగా పైథాన్‌కే ముద్దెట్టబోయాడు.. చివరకు ఏమైందో చూస్తే..?

Giant Python Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏ ఆసక్తికర వీడియో కనిపించినా త్వరగా వార్త వైరల్  అవుతూ ఉంటుంది. కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి మరికొన్ని భయాందోళనకు గురిచేసేలా ఉంటాయి.. అలాంటి ఓ వీడియోస్ సోషల్ మీడియా రచ్చ చేస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Dec 16, 2024, 05:32 PM IST
Python Video: పెళ్లాం అనుకున్నాడా ఏకంగా పైథాన్‌కే ముద్దెట్టబోయాడు.. చివరకు ఏమైందో చూస్తే..?

Giant Python Viral Video: పాముల వీడియోలు అంటే ఆసక్తిగా ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఏ పాముల వీడియో కనిపించిన వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు... అంతేకాదు కొందరు ప్రత్యేకంగా పాముల వీడియోల కోసం కూడా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ పాముల వీడియోలు ఎప్పటికప్పుడు కనువిందు చేస్తూనే ఉంటాయి అవి ట్రెండింగ్ గా నిలుస్తాయి.

వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పాములు ఇంట్లోకి వస్తాయి. ముఖ్యంగా ఊళ్లలో అడవిలో నుంచి పాములు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. పట్టణంలో కూడా పాములకు కొదవలేదు అప్పుడప్పుడు కనిపిస్తూ రోడ్లపై హల్చల్ చేస్తూ ఉంటాయి. పాములు ఇంట్లోకి రాగానే చాలామంది భయబ్రాంతులకు గురవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇంటి అనుమానాలు కూడా పాములు కనిపించడం చూసాం. అంతేకాదు సోఫా దిండుల్లో కూడా పాములు కనిపిస్తూ హల్చల్ చేశాయి. ఇక చెప్పాలంటే స్కూలు, కాలేజీల్లో ఏసి వెంట్‌ మిషన్లో నుంచి కూడా పాములు క్లాసులోకి దూరడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక ప్రయాణించే రైలు లో కూడా పాములు వస్తున్న వీడియోలు చూశాం.తాజాగా పాముకు సంబంధించిన మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ భారీ పైథాన్ ముద్దొచ్చిందో ఏమో కానీ పాములు పెంచుకునే వ్యక్తి ఏకంగా దానికి ముద్దు పెట్టపోయాడు. ఇక అది చేసిన పని చూసి అందరూ అందరికీ ఒళ్లుగగుర్పొడుస్తుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటున్నారా?

ఇక ఈ పాముకు సంబంధించిన వీడియో పూనమ్ శర్మ అనే పేజ్ లో పోస్ట్ చేసి ఉంది. ఈ పాము వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంట్రా బాబు లవర్ అనుకున్నావా ఏకంగా కొండచిలువనే ముద్దాడుతున్నావు. ఇదేం కర్మ రా బాబు అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో వ్యక్తి పాము కు ముద్దు పెట్టబోయాడు. కానీ ఏకంగా అది ఆ వ్యక్తి చంపపై కొరికేసింది. దీంతో దాన్ని వదిలించుకోవడం అతడు నానా తంటాలు పడ్డాడు. ఒక్కసారిగా పాము ఆ అబ్బాయి పై చేసిన దాడి చూస్తే ఒళ్లుగగుర్పొడుస్తుంది. ముద్దు పెట్టబోయా వ్యక్తికి ఏకంగా నోరు పెద్దగా తెరిసి అతని మూతి కొరికేయబోయింది. ఈ వీడియో చూస్తేనే వామ్మో పైథాన్‌ పరిగెత్తాల్సిందే. పాములకు దూరం ఉండడం ఎంతైనా మంచిదే అది బుస్సుమనగానే కిలోమీటర్ల దూరం పరిగెత్తే వాళ్ళు ఉంటారు. కానీ పాములు పెట్టుకొని ఏకంగా ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు.

 

 

కొండచిలువ అంటేనే మనిషిని సైతం మింగేస్తుంది. కొన్ని సినిమాలు ఒక్క మనిషినే కాదు ఇద్దరు ముగ్గురు మనుషులు మింగేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వీడియోలను చూసి మనం కూడా ఆమడ దూరం పారిపోతాం. పెంచుకున్నాను కదా అని ఈ వ్యక్తి పాముకు ముద్దెట్టబోతే అది చేసిన పనిని చూసి అందరూ పాము పామే కదా అని కామెంట్లు పెడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News