Jio vs Airtel vs Vodafone: దేశంలోని టెలీకం కంపెనీల్లో బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు ముఖ్యమైనవి. ఇందులో బీఎస్ఎన్ఎల్ ఒక్కటే ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేట్ టెలీకం కంపెనీలు టారిఫ్ రేట్లు పెంచడంతో బీఎస్ఎన్ఎల్కు డిమాండ్ పెరుగుతోంది. కారణంగా బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ఇతర కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటమే. ఇతర ప్రైవేట్ కంపెనీలు అత్యధిక డేటా ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా 5జి సేవలు బీఎస్ఎన్ఎల్ ప్రారంభించకుపోవడంతో ఆ దిశగా మార్కెట్ కైవసం చేసుకునేందుకు ప్రైవేట్ టెలీకం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు 5జి ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. మొన్నటి వరకూ అన్లిమిటెడ్ 5జి సేవలు అందరికీ అందించిన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు ఇప్పుడు ప్లాన్ మార్చాయి. రోజుకు 2జీబీ అంతకంటే ఎక్కువ డేటాతో రీఛార్జ్ చేయించుకున్నవారికే 5జి అన్లిమిటెడ్ సేవలు అందిస్తున్నాయి.
5జి ఇంటెర్నెట్ సేవలు పొందాలంటే కస్టమర్లు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లో రోజుకు 2.5 జీబీ డేటా ప్లాన్స్ రీఛార్జ్ చేయించుకోవాలి. ఇందులో ఎయిర్టెల్ అయితే 429 ప్లాన్‌తో ప్రారంభమౌతుంది. ఈ ప్లాన్‌లో 1 నెలరోజులు వ్యాలిడిటీ రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తాయి. ఇక రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపించుకోవచ్చు. అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.
వోడాఫోన్ ఐడియాలో రోజుకు 2.5 జీబీ డేటా అందించే బెస్ట్ ప్లాన్ 409 రూపాయలకు లభిస్తోంది. ఇందులో 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ కూడా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపించుకోవచ్చు. వీక్లీ రోల్ ఓవర్ డేటా ఉంటుంది. అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 5జి సేవలు పొందవచ్చు.
ఇక రిలయన్స్ జియోలో రోజుకు 2.5 జీబీ డేటా అందించే ప్లాన్ కేవలం 399 రూపాయల్లోనే లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుంటుంది. ఇందులో మొత్తం 70 జీబీ డేటా అన్లిమిటెడ్ కాలింగ్‌తో ఉంటుంది. జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా సేవలు ఉచితంగా పొందవచ్చు. 5జి ఇంటర్నెట్ సేవలు అపరిమితంగా పొందవచ్చు.
Also read: Train Tickets Subsidy: సీనియర్ సిటిజన్లకు శుభవార్త, రైల్వే టికెట్లపై సబ్సిడీ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.