Mohan Babu Arrest: టైమ్ బాకాలేకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరుగుతుందనే సామెత మోహన్ బాబు విషయంలో నిజమే అనిపిస్తోంది. హీరోను సెలబ్రిటీని కదా..అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే చట్టం చూస్తూ ఉరుకుంటుదనుకున్నాడు. కానీ ఇపుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సినీనటుడు మోహన్‌బాబు అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే ఔననే అంటున్నాయి న్యాయ వర్గాలు. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో పహాడీషరీఫ్ పోలీసులు మంచు భక్తవత్సలం పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద కొద్ది రోజుల క్రితం హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో తన ఇంట్లోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ విలేకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు. తనను అరెస్టు చేయొద్దని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా.
దీంతో కోర్టు ఈ నెల 24 వరకు ముందస్తు చర్యలొద్దని పోలీసులకు తెలిపింది. ఈ కేసులో ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టు మరో పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఆ గడువు నేటితో ముగియడంతో రాచకొండ పోలీసులు మరొకసారి మోహన్ బాబు విచారణకు పిలవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు? అని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా మోహన్ బాబు హాజరు కాకపోతే ఆయన అరెస్టు అవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి మోహన్ బాబు విచారణకు వస్తారా? లేక పోలీసులు తమ పని తాము చేసుకుపోతారా? చట్టం పుష్ప విషయంలో ఒకలా.. పెదరాయుడు విషయంలా మరోలా ప్రవర్తిస్తుందా అనేది ఉత్కంఠ గా మారింది. మరోవైపు మోహన్ బాబు ఎక్కడ ఉన్నారన్నది సస్పెన్స్‌గా మారింది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.