Naga Vamsi Bollywood Issue: టాలీవుడ్, బాలీవుడ్ మధ్య వివాదాలు ఇప్పటివరకు ఎన్నో చూశాం. ఇటీవల ఈ వివాదం మరింత హీటెక్కింది. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ.. చేసిన కామెంట్స్ వల్ల ఈ వివాదం చర్చనీయాంశమైంది. బాలీవుడ్ నిర్మాతలు ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేయడంతో టాలీవుడ్ అభిమానులు వాటికి కౌంటర్ ఇస్తున్నారు.
టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఇటీవల మాట్లాడుతూ, "పుష్ప 2 వసూళ్లను చూసి బాలీవుడ్ మునుపటి రోజులు గుర్తు చేసుకుంటోంది. హిందీ బెల్ట్‌లో పుష్ప 2 కలెక్షన్లు చూసి ముంబై నిద్రపోలేకపోయింది" అని అన్నారు. ఈ వ్యాఖ్యలను కూడా ఏకంగా బోనీకపూర్ ముందరే ఈ నిర్మాత అనడం మరింత చర్చలకు దారితీసింది.
ఈ వ్యాఖ్యలకు సంజయ్ గుప్తా వంటి బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు తీవ్రంగా స్పందించారు. "మీరు నాలుగు హిట్లు కొట్టినంత మాత్రాన బాలీవుడ్‌ని విమర్శించే హక్కు మీకు లేదు. మా సినిమాలు చూసే ఎగ్జిబిటర్ల వల్లే మీ సినిమాలు వసూళ్లు సాధించాయి" అని సంజయ్ గుప్తా ట్వీట్స్ చేశారు. అంతేకాదు.. "బోనీ కపూర్ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని ఉండగా.. అసలు ఆయన్ని ఎగతాళి చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? కేవలం నాలుగు సినిమాలు కొట్టినంత మాత్రాన ఇతను బాలీవుడ్‌కు రాజు ఏం కాదు. అయినా టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ వంటి వారితోనూ ఈయన ఇదే విధంగా మాట్లాడగలడా? విజయం అందుకోవడం మాత్రమే కాదు.. ముందుగా వేరే వాళ్లకు గౌరవం నేర్చుకోవాలి" అంటూ సంజయ్ ట్వీట్ చేశారు.
అలాగే, టాలీవుడ్ సినిమాల సంఖ్యను ప్రస్తావిస్తూ, "2020 నుండి 2024 వరకు మీరు 1500 సినిమాలు విడుదల చేశారు. అందులో బాహుబలి, RRR, పుష్ప లాంటి ఆరు చిత్రాలు మాత్రమే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మిగిలిన 1490 సినిమాల పరిస్థితి ఏంటి?" అని ప్రశ్నించారు. ఇక ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. మరోప ఈ ట్వీట్లకు టాలీవుడ్ అభిమానులు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. "మా సినిమాలు మీరు రీమేక్ చేయడం ఆపేసి కొత్తగా సినిమాలు తీయండి" అని వారు పేర్కొన్నారు.
ఈ వివాదంపై నాగవంశీ కూడా స్పందించారు. "నాకు పెద్దలను గౌరవించడం తెలుసు. బోనీ కపూర్‌తో నాకు ఎటువంటి సమస్య లేదు. మేమిద్దరం ఆరోగ్యకరమైన చర్చ జరిపాము" అని అన్నారు.
Who is this obnoxious guy sitting next to a senior producer like Boney Ji and deriding him with his fake vanity?
Look at his body language and disgusting attitude.
4/5 hits dene se yeh Bollywood ke baap nahin bane na banienge. https://t.co/WhG232dG5r— Sanjay Gupta (@_SanjayGupta) December 31, 2024
టాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఇటువంటి వివాదాలు కొత్త కాదు. అయితే, ఇలాంటి విమర్శలు వృథా కాకుండా, రెండువైపుల పరిశ్రమలు కలిసి పనిచేస్తే ప్రేక్షకులకు మరింత మెరుగైన సినిమాలు అందించవచ్చు అనేది ఎంతోమంది వాదన. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ అనేది ఒక దేశపు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అందుకే వివాదాలకు దూరంగా ఉండి, పరస్పరం సహకారం అందించడమే ఉత్తమ మార్గం.. అని మరి కొంతమంది చేస్తున్నారు.
Also Read: Dil Raju: మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరం.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook