Dil Raju Comments on Telangana: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత , ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తాజాగా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడంతో ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఈయన వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు తెలంగాణ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కారణం అవుతున్నాయని చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా థియేటర్లలో చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. జనవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.
ప్రస్తుతం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Dil Raju Shocking Comments on Telangana: ఇకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాదులో జరిగింది. అందులో ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల జనాలు సినిమా పైన చూపే ఆసక్తి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి, జనాలు నుంచి రియాక్షన్ కూడా తక్కువగా వస్తుంది అని నేను డైరెక్టర్ కి చెప్పాను అదే ఆంధ్రాకి వెళ్తే సినిమాకి ఒక మంచి వైబ్ ఇస్తారు అంటూ దిల్ రాజు కామెంట్లు చేశారు.ఇకపోతే నిజామాబాదులో తెల్ల కళ్ళు, మటన్ ను జనాలు ఆ రేంజ్ లో ఇష్టపడతారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
అదే ఏపీలో సినిమాకి వైబ్ ఇస్తే, మన దగ్గర మాత్రం తెల్ల కళ్ళు, మటన్ కి వైబ్ ఇస్తామని దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన చాలామంది తెలంగాణ ప్రజలు తినడానికి, తాగడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని వేదిక మీద చెప్పినట్లు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది తెలంగాణ రాష్ట్రాన్ని , తెలంగాణ ప్రజలను దిల్ రాజు అవమానించారు అని కూడా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: KT Rama Rao: మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా: కేటీఆర్
Also Read: Rajinikanth: కంట్రోల్ తప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎయిర్‌పోర్టులో మీడియాపై చిందులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.