ఆ రెండు దేశాల మధ్య కరోనా యుద్ధం...

కరోనా వైరస్ మరో రకమైన వివాదానికి దారితీసింది. ఈ మహమ్మారి ఇప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య అంతర్జాతీయ సంబందాలకు కారణమైందా? అనే వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో చైనాలోని వుహాన్ నగరంలో

Last Updated : Mar 14, 2020, 07:48 PM IST
 ఆ రెండు దేశాల మధ్య కరోనా యుద్ధం...

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరో రకమైన వివాదానికి దారితీసింది. ఈ మహమ్మారి ఇప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య అంతర్జాతీయ సంబందాలకు కారణమైందా? అనే వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో చైనాలోని వుహాన్ నగరంలో వైరస్ ప్రబలడానికి  అమెరికానే కారణమంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరోపించడంపై అమెరికా తీవ్రస్థాయిలో స్పందించింది.

Also Read: స్మార్ట్ ఫోన్ ధరలపై GST పిడుగు

అయితే చైనా తూర్పు ఆసియా దౌత్యవేత్త అయిన డేవిడ్ స్టిల్ వెల్ ద్వారా చైనా రాయబారికి ఈ సమన్లు జారీ చేయించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. వెంటనే ఆ వ్యాఖ్యలను ఖండించాలంటూ ఆ సమన్లలో స్పష్టం చేసినాట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశం అర్థరహిత ప్రకటనలు చేయడం సరికాదని, భవిష్యత్తులో ఎంతో ప్రమాదకరమని అమెరికా అభిప్రాయపడింది.

Read Also: మార్చి 31 వరకు తెలంగాణ బంద్..

కాగా ఇంతకుముందు చైనా కరోనా వైరస్ ఉనికిని, సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టిందని, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విమర్శల నుండి తప్పించుకునేందుకు చైనా పక్కదారి పట్టిస్తోందని డేవిడ్ స్టిల్ వెల్ వ్యాఖ్యానించారు. కరోనా విషయంలో అమెరికాను నిందించడం సరికాదని ఆ దేశ భద్రతా దళాల అధికార ప్రతినిధి అలిస్సా ఫరా పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News