Tirupati Temple Stampede: ఆంధ్రప్రదేశ్లో ఘోర విషాద సంఘటన చోటుచేసుకుంది. సంధ్య థియేటర్ సంఘటన మరచిపోకముందే తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుని నలుగురు మృతి చెందారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుని ఏడుగురు మృతి చెందారని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పదుల సంఖ్యలో భక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఏడుకు చేరిన మృతుల సంఖ్య
తొక్కిసలాట సంఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భక్తుల ఆరోగ్య పరిస్థితి విషమం.
గురువారం ఉదయం రుయా ఆస్పత్రిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శిస్తారని సమాచారం.