హైదరాబాద్: ఎప్పుడూ ఎదో ఒక అంశాన్ని తీసుకొని వివాదంగా మలిచే చాణక్యుడు రామ్ గోపాల్ వర్మ. అయితే పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వం మద్యం హోమ్ డెలివరీ చేయబోతోందని ప్రముఖ దర్శకుడు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటు ఏపీ సీఎం జగన్ లను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిగా పశ్చిమ బెంగాల్ లో మాదిరి ఇక్కడ కూడా మద్యం హోమ్ డెలివరీ చేయాలని ట్విట్టర్లో తన పోస్ట్ ద్వారా వర్మ కోరడం, అందుకు, దీనికి గాను కేటీఆర్ స్పందిస్తూ, మీరు మాట్లాడుతోంది హెయిర్ కట్స్ గురించే అనుకుంటా అంటూ చమత్కరించారు.
Sir @KTRTRS I somehow missed ur reply ..I love your sense of humour wrapped in a steel hard boxing punch ..My nose is red 😡 But I love what ur government is doing 😍 https://t.co/DwIy99AwaQ
— Ram Gopal Varma (@RGVzoomin) April 12, 2020
Read Also: పీఎం కేర్ ఫండ్ పై సుప్రీం కోర్టులో విచారణ...
తాను చేసిన పోస్ట్ కు కేటీఆర్ ఇచ్చిన రిప్లైను చూసుకున్న వర్మ మళ్లీ బదులిచ్చారు. కేటీఆర్ ఇచ్చిన రిప్లైను చూసుకోలేదని అన్నారు. ఉక్కు లాంటి బాక్సింగ్ పంచ్ తో ఉన్న కేటీఆర్ ‘సెన్సాఫ్ హ్యూమర్’ అంటే తనకు ఇష్టమని, ఆ పంచ్ కు తన ముక్కు ఎర్రగా వాచిపోయిందంటూ హాస్యాస్పదమైన పోస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం చేసున్న సహాయ సహకారలపై ప్రశంసలు కురిపించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..