కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు మరణాలు వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ క్వారంటైన్ (Home Quarantine) గడువును 28 రోజులకు పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లకు, డీజీపీకి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. బ్రేకింగ్: ఏపీలో మరో 56 కరోనా కేసులు
కరోనా పాజిటివ్ కేసు పేషెంట్లతో నేరుగా కలిసిన వారినే (Primary Contacts) ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తీసుకొచ్చి కోవిడ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించారు. కోవిడ్ లక్షణాలు కనిపించని సెకండరీ కాంటాక్ట్స్ (Secondary Contacts) కు కోవిడ్ టెస్టులు చేయవద్దని అధికారులకు సూచించారు. అదే విధంగా హోమ్ క్వారంటైన్ గడువును రెండు వారాల నుంచి నాలుగు వారాలకు (28 రోజులకు) పెంచినట్లు ప్రకటించారు. వీరిని స్థానికంగా ఉండే కొన్ని టీమ్స్ పర్యవేక్షిస్తాయని తెలిపారు. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!
కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ 928 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23 మంది కరోనా కాటుకు బలయ్యారు. చికిత్స అనంతరం కోలుకుని 194 మంది డిశ్ఛార్జ్ కాగా, ప్రస్తుతం 711 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..